సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వెనుకబడిన కులాల(బీసీల) సమస్యలను అధ్యయనం చేసేందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం ‘బీసీ అధ్యయన కమిటీ’ వివరాలను ప్రకటించారు.
ఇటీవల విజయవాడలో జరిగిన బీసీ నాయకుల సమావేశంలో చేసిన తీర్మానాలను అనుసరించి కమిటీని ఏర్పాటుచేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 15 మంది సభ్యులు, ఎనిమిది మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండే ఈ కమిటీకి గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీ సంఘాలతో, వివిధ వృత్తి సంఘాలతో సమావేశమై వారి సమస్యలను అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నివేదికను అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment