సమావేశంలో మాట్లాడుతున్న గంగాధర్ గౌడ్
భద్రాచలం : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారందరికీ రిజర్వేష¯ŒS ఫలాలు అందేలా అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మ¯ŒS వి.గంగాధర్ గౌడ్ కోరారు. ఆయన నేతత్వంలోని ందం శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రూల్ ఆఫ్ రిజర్వేష¯ŒS అమలు తీరును పరిశీలించింది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులతో సమవేశమైంది. ఆలయంలో రోస్టర్ రిజిస్టర్ ప్రకారంగా ఉద్యోగుల నియామకం జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించింది. సమావేశంలో గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం కల్పించిన రూల్ ఆఫ్ ద రిజర్వేష¯ŒS తప్పక పాటించాలన్నారు. బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో 29 శాతం రిజర్వేష¯ŒSను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రై వేటు సంస్థల్లో కూడా బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేష¯ŒS కచ్చితంగా పాటించేలా అధికారులు కషి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రై వేట్ సంస్థల్లో రోస్టర్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఔట్ సోర్సింగ్ నియామకంలో కూడా రిజర్వేష¯ŒS పాటించాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ దుర్గాప్రసాద్, ఐటీడీఏ పీఓ/ఇ¯ŒSచా చార్జీ సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవస్థానం ఈఓ తాళ్ళూరి రమేష్‌బాబు, తహసీల్దార్ రామకష్ణ, ఎంపీపీ ఊకే శాంతమ్మ, ఎంపీడీఓ ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.