బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీను
Published Sat, Oct 8 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాడి శ్రీను నియమితులయ్యారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.దుర్గా, నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు దొమ్మేటి శంకరరావు చేతుల మీదుగా శ్రీను నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి తక్షణం ప్రకటన విడుదల చేయాలన్నారు.
Advertisement
Advertisement