హైదరాబాద్: బీసీలను మరోసారి మోసగించడానికే కేసీఆర్ ప్రభుత్వం బీసీల జనగణన చేపడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేలో కులాల వారీగా పూర్తిస్థాయి లెక్కలున్నాయని, మరోసారి బీసీ గణన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వేతోపాటు, గ్రామజ్యోతి సర్వేలో బీసీ గణన లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, కేవలం బీసీలను తప్పుదారి పట్టిస్తూ, పార్టీ ప్రచారం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 34 నుంచి 56 శాతానికి పంచాయతీ రిజర్వేషన్లు అడుగుతుంటే ప్రభుత్వం 23 శాతానికి తగ్గించే విధంగా కుట్ర చేస్తోందన్నారు. బీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment