సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బీసీ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. సీపీఎస్ విధానం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని తీర్మానించారు.
అప్పుడే డిమాండ్ల సాధన సాధ్యం అవుతుందని అభిప్రాయ పడ్డారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంలో సంఘాలన్నీ మరోసారి సమావేశమై ఐక్య కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు సుధాకర్, సత్యనారాయణగౌడ్, రామలింగం, ఆంజనే యులు, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Published Wed, Sep 27 2017 1:02 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement