విద్యార్థుల మెస్ చార్జీలు పెంపు
ప్రభుత్వం ఉత్తర్వులు.. 16.99 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రిమెట్రిక్, పోస్టుమెట్రిక్ విద్యార్థుల మెస్ చార్జీలు పెరిగాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చార్జీల పెంపుపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు నిర్ణయాన్ని 2017–18 వార్షిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,650 హాస్ట ళ్లు, 450 గురుకులాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3.32 లక్షల మంది విద్యార్థులున్నారు. మరో 13.67 లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉన్నారు. తాజా పెంపుతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లలో చదివే విద్యార్థులతో పాటు రోజు వారీగా కాలేజీకి వెళ్లే విద్యార్థులు అనే నాలుగు కేటగిరీలకు ప్రభు త్వం నిధులు విడుదల చేస్తోంది. వీరిలో డేస్కాలర్ విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో, మిగిలిన వారికి సంబంధించి వారి వసతిగృహ సంక్షేమాధికారులకు మెస్ చార్జీల రూపంలో ప్రభుత్వం నిధులిస్తోంది. తాజా పెంపుతో ఆయా విద్యార్థులకు మరింత మెరుగైన భోజనం అందిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు.
విద్యార్థుల ఉద్యమాలకు ఫలితమిది: టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
ఉపకారవేతనాలు, మెస్ చార్జీల పెంపు కోసం విద్యార్థులు చేసిన ఉద్యమాలు ఫలించాయి. వారి ఉద్యమాలకు స్పందించిన ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేశా రు. చార్జీల పెంపుతో వసతిగృహాల్లో విద్యార్థు లకు మంచి భోజనం పెట్టే అవకాశం కల్పిం చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.