పాఠశాలల మూసివేత వద్దు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు లేరనే కారణం చూపుతూ 4,637 పాఠశాలలను మూసేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయటం పేదవర్గాల పిల్లలను చదువుకు దూరం చేయడమే అవుతుందని సీఎంకు రాసిన బహిరంగలేఖలో పేర్కొ న్నారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఇంగ్లిష్ మీడియంను ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టాలని కోరారు.
సుజనా చౌదరితో భేటీ...
బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, తదితర అంశాలపై కేంద్ర మంత్రి సుజనాచౌదరితో బీసీ సంక్షేమ సంఘం చర్చలు జరిపింది. బుధ వారం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ తదితరులు మంత్రితో సమావేశమయ్యారు. బీసీలకు శాఖ ఏర్పాటు విషయమై ప్రధానితో చర్చిస్తామని సుజనాచౌదరి తమ బృందానికి హామీనిచ్చి నట్టు వారు తెలిపారు.