కృష్ణయ్యకు మావోయిస్టుల బెదిరింపు లేఖ | Village president gets threat letter from maoists | Sakshi
Sakshi News home page

Oct 15 2013 6:49 AM | Updated on Mar 21 2024 7:54 PM

మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ మండలం ఉర్కొండ గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు మావోయిస్టు పేర్లతో పలు బెదిరింపు లేఖలు అందాయి. దాంతో ఆయన మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మావోయిస్టుల లేఖలు జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. గతంలో గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తనపై కొందరు కక్ష కట్టారని ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులోభాగంగానే ఈ లేఖలు అని పోలీసుల వద్ద కృష్ణయ్య ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement