సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. దీని కోసం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలతోపాటు సామాజిక అం శాలపై పోరాడుతున్న సంఘాలతో కలసి పనిచేస్తామన్నారు. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నా యని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకుపైగా ఖాళీలున్నాయని, అలాగే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఖాళీల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఉద్యమం ద్వారానే ఖాళీలు భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని తెలిపారు. యూనివర్సిటీలు, జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలకు సూచించారు. క్షేత్రస్థాయి నిరసనలు ముగిసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment