సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు బీసీ సంక్షేమ సం ఘం ఆరోపించింది. పనుల్లో నాణ్యత లోపిం చిందని, దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో వృథా అయిందని మండిపడింది. రూ.48 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొంది.
మిషన్ భగీరథ అక్రమాలపై శాసనసభా కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. ఈ పనుల్లో నాసిరకం పైపులు వాడుతున్నారని తెలిపారు. గ్రామ శివారు వరకు కొత్త పైపులు వేస్తుండగా.. గ్రామం, పట్టణాల్లో మాత్రం పాత పైపులను వినియోగిస్తున్నారన్నారు. సిమెంటు పైపుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment