పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదం తెలుపుతూ జాతీయ బీసీ కమిషన్ బిల్లును పాస్ చేయాలని, దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
ఈ బిల్లు మార్చిలోనే పాసైందని, రాజ్యసభలో కొన్ని పార్టీలు ఈబిల్లును వీగిపోయేటట్లు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీల పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.