'చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి'
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ బీసీ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ బల్లుపై మే 5,6 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు.