ఎలాంటి ఉత్తర్వులు లేకుండా హాస్టళ్ల మూసి వేత ఆలోచనలను సహించేది లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మిస్తామని
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఉత్తర్వులు లేకుండా హాస్టళ్ల మూసి వేత ఆలోచనలను సహించేది లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మిస్తామని బీసీ సంక్షేమ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లను మూసివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంపై మండి పడ్డారు.
పాఠశాలల్లోని 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి, విద్యా ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లను యథాతథంగా కొనసాగించాలని, దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, రాజేందర్, సాగర్, నీలం వెంకటేశ్, నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు.