
హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. సంఘం అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించి న తర్వాత ఆయన ప్రసంగించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్‌లపై క్రీమీలేయర్ నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్రా న్ని కోరారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు, ఉన్నతాధికారి జె. శ్రీనివాస్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, నేతలు బ్రహ్మేంద్రరావు, శేఖర్‌బాబు, జి. స్వామి, కె. సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment