
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్‌సిటీ:
ముషీరాబాద్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అభిలాష్, సంయుక్త కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదువుతున్న వీరిద్దరూ శుక్రవారం ముషిరాబాద్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో గానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు.
రూములో ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియురాలు సంయుక్త ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందగా.. తీవ్రగాయాలపాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.