
ముషీరాబాద్ : టీఆర్‌ఎస్ నాయకురాలు బుసమల్ల వసుంధర (57) మంగళవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో నిలబడడమే కాకుండా కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి వంటి సీనియర్ నేతలతో ఆమె కలిసి పని చేసినట్లు వసుంధర సోదరి సంధ్య తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ సీఎస్‌ఐ డయాసిన్ ఆఫీస్ లో సందర్శనార్థం ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు కార్ఖానాలోని సీఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారన్నారు.