భువనేశ్వర్: అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒడిషాలో అధికార బీజేడీకి గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఆరుసార్లు ఎంపీ భర్తృహరి మెహతాబ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు.
అవినీతిపై పోరాటంలో పార్టీకి కమిట్‌మెంట్ లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మెహతాబ్ వెల్లడించారు. అవినీతిపై పోరకు తాను ఇచ్చిన సలహాలు సూచనలకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి దానికి ఓపిక ఉంటుందని, ఇప్పుడది నశించిందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీని వీడినప్పటికీ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రస్తుతం కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మెహతాబ్ ఒడిషా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment