కేదార్‌నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు.. | Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తీసుకుంటూ నదిలో కాలు జారి..

Published Tue, Sep 5 2023 2:02 PM | Last Updated on Tue, Sep 5 2023 2:26 PM

Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు.  ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్‌నాథ్‌ యాత్ర మార్గమధ్యలోని  రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. 

ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు.

పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. 

ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement