Kedarnath shrine
-
కేదార్నాథ్ ఆలయం మూసివేత
కశ్మీర్: హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసివేయబడ్డాయి. విపరీతమైన చలిలో కూడా కేదార్‌నాథ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారని అధికారులు తెలిపారు. ఛార్‌దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్‌లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్‌ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్‌దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్‌లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి -
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
మోదీ గుహకు భారీ డిమాండ్
డెహ్రాడూన్: గత నెల ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ధ్యా నం చేసిన గుహకు ఇప్పుడు భక్తులు, యాత్రికుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే జులై నెలంతా బుక్కైపోగా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లలో కూడా కొన్ని తేదీలకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఈ గుహ కేదార్నాథ్ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. మే 18న ప్రధాని ఈ గుహను సందర్శించిన తర్వాత ఇప్పటి వరకు ఈ గుహ ఒక్క రోజు కూడా ఖాళీగా లేదని జనరల్ మేనేజర్ బీ ఎల్ రానా వెల్లడించారు. ఈ గుహలో ధ్యానం చేయాలనుకునేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే అనుమతిస్తారు. గుహ రుసుము ఒకరోజుకు 990 రూపాయలు. అంతేకాక, అలాంటి గుహలు ఏర్పాటు చేయడానికి అక్కడే మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.గత ఐదేళ్లలో ప్రధాని మోదీ నాలుగు సార్లు కేదార్ నాథ్‌ను దర్శించుకున్నారు. దాంతో పాటు అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడంతో యాత్రికుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు ఏడున్నర లక్షల మంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. గత నెల 9న తెరుచుకున్న ఈ ఆలయం అక్టోబర్ వరకు తెరచి ఉంటుంది. అప్పటి వరకు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో చూడాలి. -
ఏప్రిల్ 24న కేదార్నాథ్ పునఃదర్శనం
గోపేశ్వర్: హిమాలయ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ దర్శనం ఏప్రిల్ 24న పుణఃప్రారంభమవుతుంది. భక్తుల సందర్శనార్థం ఆ రోజు 8:30 గంటలకు దేవాలయ ద్వారాలను తెరవనున్నారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉత్తరాఖండ్‌లోని చార్దామ్ క్షేత్రాల్లో కేదార్నాథ్ ఒకటి. -
కేథార్‌నాథ్‌లో తొలి పూజలు
-
కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు లభ్యం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం కారణంగా మరణించిన వారి మృతదేహాలు ఇంకా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేదార్నాథ్ ప్రాంతంలో వాతావరణం మెరుగుపడడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు రోజుల్లో మరో 64 మృతదేహాలను కనుగొన్నారు. వెంటనే వాటికి మత సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. మృతులను గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం వల్ల కేదార్నాథ్ లోయ ప్రాంతంలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కొండలపైకి ఎక్కిన భక్తులుగా భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఆర్ఎస్ మీనా తెలిపారు. -
కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు లభ్యం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం కారణంగా మరణించిన వారి మృతదేహాలు ఇంకా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేదార్నాథ్ ప్రాంతంలో వాతావరణం మెరుగుపడడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు రోజుల్లో మరో 64 మృతదేహాలను కనుగొన్నారు. వెంటనే వాటికి మత సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. మృతులను గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం వల్ల కేదార్నాథ్ లోయ ప్రాంతంలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కొండలపైకి ఎక్కిన భక్తులుగా భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఆర్ఎస్ మీనా తెలిపారు.