గోపేశ్వర్: హిమాలయ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ దర్శనం ఏప్రిల్ 24న పుణఃప్రారంభమవుతుంది. భక్తుల సందర్శనార్థం ఆ రోజు 8:30 గంటలకు దేవాలయ ద్వారాలను తెరవనున్నారు. కేదార్నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చార్దామ్ క్షేత్రాల్లో కేదార్నాథ్ ఒకటి.