డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం కారణంగా మరణించిన వారి మృతదేహాలు ఇంకా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేదార్‌నాథ్ ప్రాంతంలో వాతావరణం మెరుగుపడడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు రోజుల్లో మరో 64 మృతదేహాలను కనుగొన్నారు. వెంటనే వాటికి మత సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. మృతులను గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం వల్ల కేదార్‌నాథ్ లోయ ప్రాంతంలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కొండలపైకి ఎక్కిన భక్తులుగా భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఆర్‌ఎస్ మీనా తెలిపారు.