కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు లభ్యం | Uttarakhand: 64 bodies recovered in Kedarnath valley | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు లభ్యం

Published Fri, Sep 6 2013 6:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం కారణంగా మరణించిన వారి మృతదేహాలు ఇంకా ఒకటొకటిగా బయటపడుతున్నాయి.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం కారణంగా మరణించిన వారి మృతదేహాలు ఇంకా ఒకటొకటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేదార్‌నాథ్ ప్రాంతంలో వాతావరణం మెరుగుపడడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు రోజుల్లో మరో 64 మృతదేహాలను కనుగొన్నారు. వెంటనే వాటికి మత సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. మృతులను గత జూన్‌లో సంభవించిన వరద బీభత్సం వల్ల కేదార్‌నాథ్ లోయ ప్రాంతంలో ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కొండలపైకి ఎక్కిన భక్తులుగా భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఆర్‌ఎస్ మీనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement