taking
-
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
కళ తప్పిన బంగారం ఈటీఎఫ్‌లు.. కారణమిదే!
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) పెద్దగా కలసి రాలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.653 కోట్లకు పరిమితమయ్యాయి. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడం ఇందుకు కారణమని చెప్పుకోవాలి. పెట్టుబడులు తగ్గినప్పుటికీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్ల ఫోలియోలు (ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు నంబర్) మార్చి చివరికి 47 లక్షలకు పెరిగాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2022–23లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. బంగారం ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపించారు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల దిద్దుబాటుకు లోను కాగా, డెట్ సాధనాలు ఆకర్షణీయంగా మారడం గమనించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం.. 2021–22లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,541 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2022–23లో 75 శాతం తగ్గి రూ.653 కోట్లకు పరిమితయ్యాయి. 2019–20లో చూసినా కానీ రూ.1,614 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. అంతకుముందు సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు కుమ్మరించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంచి రాబడులు వస్తుండడంతో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారం ప్రియం.. వార్షికంగా చూస్తే 2022–23లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది ఇన్వెస్టర్లు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘ఈక్విటీలకు ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగాల్లోకి అదే పనిగా పెట్టుబడులు పెరగడం దీన్ని తెలియజేస్తోంది. రూపాయి బలహీన పడడం, యూఎస్ డాలర్ అప్ ట్రెండ్‌లో ఉండడం బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం చూపించాయి. మరింత ఖరీదుగా బంగారాన్ని మార్చేశాయి. ఇది మొత్తం మీద బంగారం ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది’’అని కవిత కృష్ణన్ వివరించారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్లను నాలుగు విడతలుగా ఇష్యూ చేసింది. ఇది కూడా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ప్రభావం చూపించింది. మార్చి చివరి వారంలో బంగారం ధర 10 గ్రాములు రూ.59,400కు చేరడం తెలిసిందే. బంగారం ధరలు సానుకూలంగా ఉండడం, అదే సమయంలో ఇతర పెట్టుబడి సాధనాలు ప్రతికూల రాబడులు ఇవ్వడంతో, ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రాబడులు స్వీకరించినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో 2023లో బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికీ సౌకర్యస్థాయికి ఎగువన కొనసాగుతుండడం, వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల వైఖరి, ఆర్థిక వృద్ధి అవకాశాలు బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరో 10–15 శాతం మేర ప్రస్తుత సంవత్సరంలో పెరిగే అవకాశాలున్నాయని గోపాల్ కావలిరెడ్డి అంచనా వ్యక్తం చేశారు. -
అపోహలు వదిలి.. టీకా తీసుకుంటున్న జనం
-
బలవంతపు భూసేకరణ అప్రజాస్వామికం
– సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ వనపర్తి : ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం జీఓ 123ను రూపొందించి చేస్తున్న బలవంతపు భూసేకరణ అప్రజాస్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. రైతులు, కూలీల వాదనలు విని హైకోర్టు జీఓను రద్దు చేసిందన్నారు. ఈ విషయమై ఆదివారం స్థానిక పీఆర్ అతిథి గహంలో అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. కూలీలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు ఎలాంటి పరిహారం ఇవ్వదలుచుకున్నారో నిర్ణయించకుండానే ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి మరోసారి భంగపడిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్, యూత్‌కాంగ్రెస్, జేఏసీ నాయకులు పాల్గొని బాధితులందరికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు డి. చంద్రయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుపుల తిరుపతయ్య, సీపీఎం డివిజన్ నాయకులు పుట్ట ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి డి. కురుమయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వినయ్‌కుమార్, నాయకులు గోపాలకష్ణ, కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు కోట్లరవి, ఎన్ఎస్యూఐ నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు. -
ఏనుగుతో సెల్ఫీ తెచ్చిన తంటా...!
తిరువనంతపురంః సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదిరి పాకాన పడుతోంది. యాండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమాని జనంలో సెల్ఫీల పిచ్చి ముదిరిపోతోంది. ఫ్రెంట్ కెమెరాతో ఎవరికి వారు ఫొటోలు తీసుకునే అవకాశాన్ని కల్పించిన ఆధునిక పరిజ్ఞానం.. మితిమీరిన పోకడలతో తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. రైల్వే ట్రాక్ లు, సఫారీలు, రహదార్లు, ఎత్తైన కొండలు, సముద్ర తీర ప్రాంతాలు ఒక్కటేమిటి సెల్ఫీల బాగోతానికి ప్రతి వస్తువూ పదార్థంగానే మారుతోంది. ప్రమాదపుటంచులకు ప్రాణాలను నెట్టేస్తోంది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఏనుగు దాడి అందుకు మరోసారి తార్కాణంగా నిలుస్తోంది. సింహం పడుకుందికదాని జూలుతో జడేయాలనుకోవద్దంటూ ఓ సినీ హీరో చెప్పిన చందంగా మారింది కేరళలోని తిరువనంతపురం వద్ద జరిగిన ఘటన. ఏనుగు కనిపించింది కదాని దాంతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాడు ఓ యువకుడు. అయితే అప్పటికే ఆలయాల వేడుకల్లో తీవ్రంగా విశ్రాంతి తీసుకుంటున్నసదరు జంబోకు కోపం తలకెక్కిందో ఏమో 37 ఏళ్ళ వయసున్న అతడిపై దాడికి దిగింది. సంఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడు స్థానిక వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ అరటిపళ్ళ గెలను తీసుకుని ఏనుగు దగ్గరకు వెళ్ళిన వ్యక్తి దానికి దగ్గరగా నిలబడి వరుసగా సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆగ్రహించిన జంబో.. తొండంతో అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ సెల్ఫీ ప్రేమికుడు రక్షించమంటూ అరుపులు ప్రారంభించడంతో దగ్గరల్లో ఉన్న జనం అతడ్ని కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. -
ప్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరణ