మాట్లాడుతున్న ఎండీ. జబ్బార్
– సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్
వనపర్తి : ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం జీఓ 123ను రూపొందించి చేస్తున్న బలవంతపు భూసేకరణ అప్రజాస్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ అన్నారు. రైతులు, కూలీల వాదనలు విని హైకోర్టు జీఓను రద్దు చేసిందన్నారు. ఈ విషయమై ఆదివారం స్థానిక పీఆర్ అతిథి గహంలో అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. కూలీలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు ఎలాంటి పరిహారం ఇవ్వదలుచుకున్నారో నిర్ణయించకుండానే ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి మరోసారి భంగపడిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్, యూత్‌కాంగ్రెస్, జేఏసీ నాయకులు పాల్గొని బాధితులందరికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు డి. చంద్రయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుపుల తిరుపతయ్య, సీపీఎం డివిజన్ నాయకులు పుట్ట ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి డి. కురుమయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ వినయ్‌కుమార్, నాయకులు గోపాలకష్ణ, కేవీపీఎస్ డివిజన్ కార్యదర్శి నాగరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు కోట్లరవి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు.