సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి అంత్యక్రియలు
హైదరాబాద్: సినీ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. తొలుత ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించి అక్కడ్నుంచి ఫిల్మ్ చాంబర్ కు తీసుకువెళ్తారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సోమవారం చక్రి (40) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1974 జూన్ 15న చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చక్రి ఆకస్మిక మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర ద్రిగ్భాంతికి గురైంది.