వాజ్‌పేయి 1982లో శంకర్‌పల్లికి వచ్చారు కరెన్సీ నాణేలతో తులాభారం దృశ్యం
శంకర్‌పల్లి : శంకర్‌పల్లితో మాజీ ప్రధాని అటల్‌బిహరీ వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్న వాజ్‌పేయిని 1982 మార్చి 13న శంకర్‌పల్లి పట్టణ వ్యాపారస్తులు శంకర్‌పల్లికి పిలిపించుకొని తులాభార కార్యక్రమం నిర్వహించారు.
వాజ్‌పేయ్ రాష్ట్ర పర్యటకు వచ్చినప్పుడు వ్యాపారులు పాండురంగం గుప్తా, మిర్యాల కాశీనాథం, దండు రాజేశ్వర్ గుప్తా, సాత ఆత్మలింగం, సాత విశ్వనాథం, సత్యనారాయణ, ప్రకాశ్‌గుప్తా, మిర్యాల సత్యనారాయణ, మిర్యాల కవిత, సుధా, నళిని, గార్లపాటి వీరేశం తదితరులు బంగారు లక్ష్మణ్ సహకారంతో వాజ్‌పేయిని శంకర్‌పల్లికి తీసుకొచ్చారు.
మంచి వ్యక్తిత్వం గల మనిషిని సన్మానించాలని తీసుకువచ్చామని వ్యాపారులు తెలిపారు. శంకర్‌పల్లికి వచ్చిన ఆయనను ఘనంగా ఉరేగించి స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో తులాభారం నిర్వహించారు. రూపాయి నాణేలతో తులాభారం వేయగా వాజ్‌పేయి 82 కేజీలు తుగారు. మొత్తం రూ.10వేలను పార్టీ నిధికి విరాళం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment