గోపాలస్వామి గుడి పక్కనే ఉన్న భూమిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు
వరంగల్ : అధికారుల పట్టింపులేనితనం.. అక్రమార్కులకు వరంగా మారింది. కోరిన కోర్కెలు తీర్చే దేవుడి భూమినే కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే స్థలం రోజు రోజుకూ కనుమరుగవుతోంది. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న గోపాలస్వామి ఆలయానికి చెందిన సుమారు 800 గజాల భూమిని ఆలయ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా గోపాలస్వామి గుడికి దేవుని మాన్యం కింద సర్వే నంబర్ 381, 388/ఆ, 499, 500, 396, 493, 392/2లో 4.22 ఎకరాల భూమి ఉంది.
ఈ మేరకు 1954–55 నుంచి శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ సర్వే నంబర్ల పరిధిలో తోట మైదానం, గుడి, డాక్టర్స్‌కాలనీ–1, డాక్టర్స్‌కాలనీ–2లో భూమి మొత్తం ఉంది. అయితే సర్వే నంబర్ 392/2లో ఉన్న పంప్‌హౌస్ సమీపంలోని లక్ష్మీగార్డెన్స్ పక్కన ఎంత భూమి ఉందో దేవాదాయ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఇందులో మిత్రమండలి పేరుతో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూ ల్ ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చెం దడం లేదు. వారు అద్దె చెల్లిస్తున్నారా... ఎంత చెల్లిస్తున్నారు.. అన్న విషయాలు మాత్రం ఆల య కమిటీ, శాఖ అధికారులకే తెలుస్తోంది.
గుడి పేరుతో పాఠశాల నిర్వహణ..
ఆలయానికి ఆనుకుని గోపాలస్వామి గుడి స్కూల్ పేరుతో ఎయిడెడ్ పాఠశాలను ప్రారంభించారు. 1965లో అప్పటి మునిసిపాలిటీ అధికారులు స్కూల్‌కు ఇంటి నంబర్ 13– 696ను కేటాయించారు. అదే పేరుతో రికార్డుల్లో నమోదైంది. అయితే ఏమాయ జరిగిందో తెలియదుకానీ.. 1975లో గోపాలస్వామి టెంపుల్ స్కూల్ పేరు కాస్తా ఇదే నంబర్‌తో శేషాచారిగా మునిసిపల్ రికార్డుల్లోకి మారింది. విషయం తెలియడంతో 1984లో ఈ పాఠశాల ప్రభుత్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్‌గా పేరు మారి రికార్డుల్లో నమోదైంది. 1993లో వరంగ ల్ మునిసిపాలిటీ కాస్తా మునిసిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కావడంతో నగరంలో కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించారు.
దీంతో ఆలయానికి సంబంధించిన భూమిలో ఉన్న ప్రభు త్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్ నంబర్ కాస్తా ఇంటి నంబర్ 13–4–157గా మారింది. అప్ప టి నుంచి అదే పేరుతో ఉన్న పాఠశాల పేరు కాస్తా 2016లో మారింది. ప్రభుత్వ పాఠశాల స్థానంలో అరుట్ల శేషాచారి పేరు గ్రేటర్ కార్పొరేషన్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి పా ఠశాల భూమిని అమ్మేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేసినా కొంత మంది దేవాలయ భూ మిని మీరు ఎట్లా విక్రయిస్తారని అడ్డుకోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ స్థలంలో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మా రింది. వి షయాన్ని గుర్తించిన అధికారులు పాఠశాల ను వేరేచోటికి తరలించారు. తర్వాత భవనం కూ లిపోవడంతో ఎవరు స్థలాన్ని పట్టించుకోలేదు.
గుడి భూమి విక్రయం..?
గుడి భూమిని ఇటీవల విక్రయించినట్లు తెలి సింది. దీంతో విశ్వ హిందూ పరిషత్ మహా నగర కమిటీ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని అర్బన్ కలెక్టర్, ఆర్డీఓ, వరంగల్ తహసీల్దార్, గ్రేటర్ వరంగల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన కలెక్టర్ వరంగల్ తహసీల్దార్‌తో మాట్లాడి భూముల రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, గుడి పక్కనే ఉన్న పాఠశాల భూమిలో ఇటీవల పునాదులు తీయ డం ప్రారంభమైంది. ఈ భూమిని ఆలయ నిర్వాహకులు అమ్మారని కొందరు.. పాఠశాల నిర్వాహకులు విక్రయించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ ఇన్‌చార్జి ఈఓ ధనుంజయను వివరణ కోరేందుకు ‘సాక్షి’ సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment