Govt officers
-
అధికారులపైనా కేసులు
సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తూ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ ఫోకస్ చేసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రగతినగర్‌లోని ఎర్రకుంట, చందానగర్ ఈర్ల చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఐదుగురు ప్రభుత్వ అధికారుల పాత్రను గుర్తించింది. సదరు ఆక్రమణలపై నమోదైన కేసుల్లో ఈ అధికారులను కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం లేఖ రాశారు. ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట బఫర్ జోన్లో 0.29 ఎకరాలను బిల్డర్లు ఆక్రమించి మూడు భవనాలను నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 14న కూల్చేశారు. ఆ నిర్మాణాలకు కారణాలపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ విభాగానికి చెందిన ‘సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్’ కె.శ్రీనివాస్ ఈ స్థలానికి సంబంధించి రెండు రికార్డులు రూపొందించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఒకదానిలో అది ప్రభుత్వ స్థలమని, మరో దానిలో అది ప్రైవేట్ స్థలమని పొందుపరిచారు. అవసరాన్ని ఒక్కో రిపోర్టును తీసి ఇవ్వడం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు చెరువు సర్వే నంబర్‌ను కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మరో భూమికి సంబంధించిన సర్వే నంబర్ కేటాయించారు. ఈ వ్యవహారంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అంతేకాదు హెచ్ఎండీఏలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఆ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే అనుమతి మంజూరు చేశారు. ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు హైడ్రా నిర్ధారించింది. దీనితో ఈ కేసులో నలుగురు అధికారులనూ నిందితులుగా మార్చాలని పోలీసులను కోరింది. ఏమీ రాయకుండా ‘చుక్క’ పెట్టి లైన్ క్లియర్! చందానగర్ పరిధిలోని ఈర్ల చెరువు ఆక్రమణ వ్యవహారంపైనా హైడ్రా లోతుగా ఆరా తీయగా మరో బాగోతం బయటపడింది. ఇక్కడ 0.16 ఎకరాలను ఆక్రమించిన కొందరు.. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులతో ఒక నిర్మాణం, గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో మరో రెండు నిర్మాణాలను చేపట్టారు. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 10న ఆ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆక్రమణలకు సంబంధించి చందానగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు మంజూరైనట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ గత డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుధాంశ్‌తోపాటు మాజీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఎం.రాజ్‌కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈర్ల చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. దరఖాస్తుతోపాటు ఇరిగేషన్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకుని జత చేయాలి. బిల్డర్లు అలా చేయలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) ఆ వివరాలను పొందుపరుస్తూ రాజ్‌కుమార్‌కు ఫార్వర్డ్ చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్‌పై రాజ్‌కుమార్ తన అభిప్రాయాలను జోడిస్తేనే అది డిప్యూటీ కమిషనర్‌కు వెళుతుంది. కానీ రాజ్‌కుమార్ దానిపై ఎలాంటి కామెంట్లు రాయకుండా.. కేవలం ఓ చుక్క (డాట్) పెట్టి డిప్యూటీ కమిషనర్‌కు ఫార్వర్డ్ చేసేశారు. దీని ఆధారంగా డిప్యూటీ కమిషనర్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేశారు. ఇది గుర్తించిన హైడ్రా చందానగర్‌లో నమోదైన కేసులో సుధాంశ్, రాజ్‌కుమార్‌లను నిందితులుగా చేర్చాలని సిఫార్సు చేసింది. ఏసీబీ అధికారుల దృష్టికి కూడా.. సాధారణంగా అన్నీ సరిగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి కావాలన్నా.. సంబంధిత అధికారుల చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది చెరువులు, కుంటలు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు అంటే.. అధికారుల చేతికి ముడుపులు దండిగా అందినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారి ఉంటాయని హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక ఉదంతాలపై విజిలెన్స్ విచారణలు కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగించాలని హైడ్రా భావిస్తున్నట్టు తెలిసింది. -
కాళేశ్వరం స్కాం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
చంద్రబాబు పాలన.. నిద్రపోతున్న ప్రభుత్వ ఆఫీసర్లు..
-
కూటమి ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు
-
"నేను స్పీకర్..మీ అంతు చూస్తా.." అధికారులపై అయ్యన్న ఫైర్
-
అధికారులపై నోరు జారిన అయ్యన్న పాత్రుడు
-
రెగ్యులర్ అధికారులు లేక.. గాడితప్పుతున్న పాలన..!
బెజ్జూర్: మండలంలో ఇన్చార్జీల పాలన కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల్లో ప్రభుత్వం నియమించిన ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో ఇక్కడ పని చేయలేకపోతున్నారని దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలో తహసీల్దార్, పశువైద్యాధికారి, టీజీబీ మేనేజర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. మండలానికి వచ్చేందుకు విముఖత.. మండలంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి గత ఆగస్టు 8న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమించిన అధికారి ఇక్కడికి రావడానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా తహసీల్దార్లను బెజ్జూర్‌కు వెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో నెలరోజుల నుంచి డెప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు ఇన్చార్జి తహసీల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. పశు వైద్యాధికారి లేక ఇబ్బందులు.. మండల కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పాడి పోషకులు అనేక అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడంతో పెంచికల్‌పేట పశువైద్యాధికారి రాకేశ్‌ను ఇన్‌చార్జీగా నియమించారు. ఆయ న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి, సీజనల్ వ్యాధులతో పశువులు అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు. రైతులకు అందని బ్యాంక్ సేవలు బెజ్జూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నారు. మేనేజర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయగా.. పెంచికల్పేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రవికుమార్‌ను ఇక్కడ ఇన్చార్జి మేనేజర్‌గా నియమించారు. రెగ్యులర్ మేనేజర్ కావడంతో రైతులకు రుణాల రెన్యూవల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్చార్జి మేనేజర్ కావడంతో సకాలంలో సేవలు అందడం లేదని బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. విద్యార్థులకు తప్పని తిప్పలు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కుంటలమానేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. సదరు ఉపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్
సాక్షి, నరసరావుపేట: ‘నేను మూర్ఖుడిని.. తగ్గేదే లేదు. అందరి పేర్లూ ఎర్ర బుక్‌లో రాసుకుంటున్నా. ఎవర్నీ వదలను.. టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అంటూ వినుకొండలో జరిగిన బహిరంగసభలో టీడీపీ నేత నారా లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్ర బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం, పట్టణంలో సాగింది. కొంతమంది అధికారులు అధికారపార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు. 2019–24 మధ్య ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే.. అధికారంలోకి వచ్చాక అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని టీడీపీ కార్యకర్తలకు లోకేశ్ సూచించారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ -
ప్రభుత్వ కార్యాలయంలో మంటలు.. విలువైన ఫైల్స్ బుగ్గిపాలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాత్పురా భవన్‌లోని మూడో అంతస్తులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విలువైన ధ్రువపత్రాలు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు. సెలవు దినమైనందున ఎవరూ కార్యాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఫోన్లో ప్రమాదం గురించి వివరించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అన్ని విధాలు సహాయం అందుతుందని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన సాత్పుర భవన్లో మంటలు చెలరేగడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతి భయటపడుతుందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించాయి. ఎలాగూ వచ్చేసారి అధికారంలోకి రాలేమనే భయం అధికార పార్టీకి పట్టుకుందని విమర్శించాయి. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్‌లో జైపూర్‌లోని యోజన భవన్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్‌లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్లో బేస్మెంట్లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్మెంట్లోని అల్మార్్లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్‌ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023 (చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!) -
... ఏం చెప్పకున్నా కూడా ‘యస్ సార్’ అంటాం.. ఓకేనా సార్!!
... ఏం చెప్పకున్నా కూడా ‘యస్ సార్’ అంటాం.. ఓకేనా సార్!! -
బతికుండగానే చంపేశారు
సాక్షి,సత్తుపల్లి(ఖమ్మం): బతికున్న వృద్ధురాలు చనిపోయినట్టుగా రికార్డుల్లో నమోదు చేయడంతో పింఛన్ నిలిచిపోయిన ఘటన సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీలో వెలుగుచూసింది. పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి జాబితాను రూపొందించే క్రమంలో కొమ్మేపల్లికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు రఫీమోనిషా కూడా మృతి చెందిందని నమోదు చేసినట్లు తెలుస్తోంది. చనిపోయినా పింఛన్ పొందుతున్న వారి వివరాల పరిశీలనకు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో పొరబాటు జరిగినట్లు సమాచారం. గంగారంలో కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు నమోదు కాగా, మళ్లీ పొరబాటును సరిచేశారని తెలిసింది. అయితే కిష్టారం పంచాయతీలో సుమారు 20 మందికి పైగా చనిపోయినా పింఛన్ పొందినట్టు విచారణలో తేలడంతో కుటుంబీకుల నుంచి రికవరీ కోసం నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై సత్తుపల్లి ఎంపీడీఓ సుభాషిణిని సోమవారం వివరణ కోరగా రఫీమోనిషాకు ఒక నెల మాత్రమే పింఛన్ ఆగిందని.. సమగ్రంగా విచారించి పునరుద్ధరిస్తామని తెలిపారు. -
నకిలీ చలానాల వ్యవహారంపై అధికారుల చర్యలు.. ముగ్గురు సస్పెండ్
విజయనగరం: నకిలీన చలానాల వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మరో ఇద్దరు అధికారుల సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ రమేశ్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ నరసింగరావును డీఐజీ కల్యాణి సస్పెండ్ చేశారు. చదవండి: ప్రభుత్వ భూముల మ్యుటేషన్.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
కాలినడకన అటవీ గ్రామానికి..
గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన గూడూరు మండలంలోని అటవీ గ్రామం దొరవారి తిమ్మాపురానికి సరైన దారిలేదు. 20 కుటుంబాల్లోని 80 మంది గిరిజను లు పోడు వ్యవసాయం చేస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం బుధవారం కొత్తగూడ పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె స్పందించి ఊరి సమస్యలపై నివేదిక అందజేయాలని కలెక్టర్ గౌతమ్‌ను ఆదేశించారు. ఆయన అక్కడికక్కడే తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఇతర అధికారులతో సమావేశమై గ్రామ సమస్యల గురించి ప్రశ్నించగా.. తామంతా కొత్తగా వచ్చినందున అవగాహన లేదని చెప్పారు. దీంతో గురువారం అందరూ గ్రామానికి వెళ్లాలని ఆదేశించా రు. ఈ మేరకు ఉదయమే తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ ప్రసాదరావు ఊట్ల మీదుగా 6 కి.మీ. వాహనాలపై వెళ్లారు. అక్కడి నుంచి సుమారు కాలినడకన 8 కి.మీ. వెళ్తూ మార్గమధ్యలో వాగు దాటి ముందుకుసాగారు. దొరవారి తిమ్మాపురానికి చేరుకుని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఐదు రోజుల పెళ్లి, అక్కడ వరుడు తాళి కట్టడు! -
దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు మంగళవారం రికార్డు స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను ప్రధాని మోదీ హయాంలో అవినీతిపై చేపట్టిన అతిపెద్ద చర్యగా భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ.250 కోట్ల స్కాలర్ షిప్ కుంభకోణానికి సంబంధించి పలు విద్యా సంస్థలపై దాడులు జరిపింది. అదేవిధంగా, యూపీలో రద్దయిన నోట్ల చెలామణీ ఆరోపణలపై నాలుగుచోట్ల సోదాలు జరిపింది. రూర్కెలాలోని బోకారో స్టీల్ ప్లాంట్‌లో అవినీతి కేసులో రాంచీ, బొకారో, కోల్‌కతాలోని అధికారుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ.. అవినీతి, నేర పూరిత ప్రవర్తన, ఆయుధాల స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 30 కేసులు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల లైసెన్స్ జారీలో అక్రమాలకు సంబంధించి 13 చోట్ల సోదాలు చేశామని సీబీఐ తెలిపింది. మంగళవారం ఉదయం ఏకకాలంలో ప్రారంభమైన ఈ సోదాల్లో 500 మంది అధికారులు పాల్గొన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా నగదు, నగలతోపాటు పలు బ్యాంకు పత్రాలు, స్థిరాస్తులు, మ్యూచువల్ ఫండ్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. రూ.1,139 కోట్ల బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ గత వారం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 చోట్ల తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. -
అధికారులా.. అతిథులా..!
సాక్షఙ, బిట్రగుంట (నెల్లూరు): బోగోలు మండలంలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన పక్కనపెట్టి చుట్టపుచూపుగా కార్యాలయాలకు వచ్చిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయాలైన రెవెన్యూ, మండల పరిషత్, డ్వాక్రా, తదితర కార్యాలయాల అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకూ రాకపోతుండటం, అసలు వస్తారో రారో కూడా తెలియకపోతుండటంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిలో ఒక్కరూ కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. అందరూ కావలి, నెల్లూరు నుంచి రావాల్సి ఉండటంతో తీరిగ్గా ప్రయాణ సౌలభ్యాన్ని చూసుకుని వస్తున్నారు. ఉదాహరణకు రైతులు, అర్జీదారులతో నిత్యం రద్దీగా ఉండే తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్లలో ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండటం లేదు. వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కలెక్టర్ అయినా కనిపిస్తాడేమో కానీ వీఆర్వోలు మాత్రం ఆచూకీ కూడా దొరకరు. దరఖాస్తుదారులు ఫోన్ చేస్తే సమాధానం చెప్పరు. ఫీల్డ్‌లో ఉన్నామని ఫోన్ పెట్టేస్తారు. గట్టిగా అడిగితే సోమవారం గ్రీవెన్స్‌లో కనిపించమని చెబుతున్నారు. ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే.. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినీ కుర్చీలు ఖాళీగా ఉంటాయని, అదేమని అడిగితే ఒకరేమో ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారని, మరొకరేమో ఖజానాకు వెళ్లారని, ఇంకొకరేమో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారని వాపోతున్నారు. ఎప్పుడు వచ్చినా ఇవే సమాధానాలు చెబుతున్నారు తప్ప పనులు చేయడం లేదని వివరిస్తున్నారు. కంప్యూటర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సరిగా ఉండటం లేదని, టైపిస్ట్ స్థానంలో వీఆర్ఓలు పనిచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏ చిన్న పని అడిగినా సర్వర్ పనిచేయడం లేదని పంపిచేస్తున్నారని వాపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయం ఉద్యోగులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ప్రత్యేకాధికారులు మాత్రం గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ‘స్పందన’ను నీరుగార్చారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అట్టహాసంగా నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని మండలంలో అధికారులు నీరుగార్చారు. తహసీల్దార్ కార్యాలయంలో స్పందన పేరుతో చిన్న ఫ్లెక్సీ కట్టి చేతులు దులుపుకున్నారే తప్ప కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు స్పందన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా గ్రామాల్లో దండోరా వేయించడం కానీ, ప్రెస్‌నోట్ విడుదల చేయడం కానీ చేయలేదు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. చిన్న పనికి కూడా పదేపదే తిప్పుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం సరికాదు. – మేకల శ్రీనివాసులు, ఎంపీటీసీ -
ఎవరినీ ఉపేక్షించం
న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కైలాశ్ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే. ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం. -
ఈసీ పరీక్షలో 323 అధికారులు ఫెయిల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో.. ఎలక్షన్ల కోసం సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర అధికారులు కొందరు షాకిచ్చారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సిన విధులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో 323 మంది అధికారులు కనీస ప్రతిభ కూడా చూపడంలో ఫెయిలయ్యారు. దీంతో ఈసీ అధికారులు అవాక్కయ్యారు. ఇందులో సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ (గ్రూప్–1, డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్లు) స్థాయి అధికారులు కూడా ఉన్నారు. భోపాల్, సెహోర్, హోషంగాబాద్, రాఘోఘట్, గునా, గ్వాలియర్, ఇండోర్, ఛతర్పూర్ తదితర జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో కీలక పాత్రల్లో ఈ అధికారులు నియమితులయ్యారు. దాదాపు 700 మంది అధికారులకు ఎన్నికల విధుల నిర్వహణపై ఉన్న అవగాహనపై పరీక్ష నిర్వహించారు. ‘ఇది చాలా సీరియస్ అంశం. చాలా మంది అధికారులు పరీక్ష ఫెయిలయ్యారు. ఇలా ఉంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిపెట్టాలి’ అని ఆర్టీఐ కార్యర్త అజయ్ దుబే విమర్శించారు. -
దర్జాగా కబ్జా..!
వరంగల్ : అధికారుల పట్టింపులేనితనం.. అక్రమార్కులకు వరంగా మారింది. కోరిన కోర్కెలు తీర్చే దేవుడి భూమినే కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే స్థలం రోజు రోజుకూ కనుమరుగవుతోంది. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న గోపాలస్వామి ఆలయానికి చెందిన సుమారు 800 గజాల భూమిని ఆలయ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా గోపాలస్వామి గుడికి దేవుని మాన్యం కింద సర్వే నంబర్ 381, 388/ఆ, 499, 500, 396, 493, 392/2లో 4.22 ఎకరాల భూమి ఉంది. ఈ మేరకు 1954–55 నుంచి శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ సర్వే నంబర్ల పరిధిలో తోట మైదానం, గుడి, డాక్టర్స్‌కాలనీ–1, డాక్టర్స్‌కాలనీ–2లో భూమి మొత్తం ఉంది. అయితే సర్వే నంబర్ 392/2లో ఉన్న పంప్‌హౌస్ సమీపంలోని లక్ష్మీగార్డెన్స్ పక్కన ఎంత భూమి ఉందో దేవాదాయ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఇందులో మిత్రమండలి పేరుతో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూ ల్ ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చెం దడం లేదు. వారు అద్దె చెల్లిస్తున్నారా... ఎంత చెల్లిస్తున్నారు.. అన్న విషయాలు మాత్రం ఆల య కమిటీ, శాఖ అధికారులకే తెలుస్తోంది. గుడి పేరుతో పాఠశాల నిర్వహణ.. ఆలయానికి ఆనుకుని గోపాలస్వామి గుడి స్కూల్ పేరుతో ఎయిడెడ్ పాఠశాలను ప్రారంభించారు. 1965లో అప్పటి మునిసిపాలిటీ అధికారులు స్కూల్‌కు ఇంటి నంబర్ 13– 696ను కేటాయించారు. అదే పేరుతో రికార్డుల్లో నమోదైంది. అయితే ఏమాయ జరిగిందో తెలియదుకానీ.. 1975లో గోపాలస్వామి టెంపుల్ స్కూల్ పేరు కాస్తా ఇదే నంబర్‌తో శేషాచారిగా మునిసిపల్ రికార్డుల్లోకి మారింది. విషయం తెలియడంతో 1984లో ఈ పాఠశాల ప్రభుత్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్‌గా పేరు మారి రికార్డుల్లో నమోదైంది. 1993లో వరంగ ల్ మునిసిపాలిటీ కాస్తా మునిసిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కావడంతో నగరంలో కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించారు. దీంతో ఆలయానికి సంబంధించిన భూమిలో ఉన్న ప్రభు త్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్ నంబర్ కాస్తా ఇంటి నంబర్ 13–4–157గా మారింది. అప్ప టి నుంచి అదే పేరుతో ఉన్న పాఠశాల పేరు కాస్తా 2016లో మారింది. ప్రభుత్వ పాఠశాల స్థానంలో అరుట్ల శేషాచారి పేరు గ్రేటర్ కార్పొరేషన్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి పా ఠశాల భూమిని అమ్మేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేసినా కొంత మంది దేవాలయ భూ మిని మీరు ఎట్లా విక్రయిస్తారని అడ్డుకోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ స్థలంలో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మా రింది. వి షయాన్ని గుర్తించిన అధికారులు పాఠశాల ను వేరేచోటికి తరలించారు. తర్వాత భవనం కూ లిపోవడంతో ఎవరు స్థలాన్ని పట్టించుకోలేదు. గుడి భూమి విక్రయం..? గుడి భూమిని ఇటీవల విక్రయించినట్లు తెలి సింది. దీంతో విశ్వ హిందూ పరిషత్ మహా నగర కమిటీ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని అర్బన్ కలెక్టర్, ఆర్డీఓ, వరంగల్ తహసీల్దార్, గ్రేటర్ వరంగల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన కలెక్టర్ వరంగల్ తహసీల్దార్‌తో మాట్లాడి భూముల రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, గుడి పక్కనే ఉన్న పాఠశాల భూమిలో ఇటీవల పునాదులు తీయ డం ప్రారంభమైంది. ఈ భూమిని ఆలయ నిర్వాహకులు అమ్మారని కొందరు.. పాఠశాల నిర్వాహకులు విక్రయించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ ఇన్చార్జి ఈఓ ధనుంజయను వివరణ కోరేందుకు ‘సాక్షి’ సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
అవినీతి అధికారులకు పాస్‌పోర్ట్ నో
న్యూఢిల్లీ: నేరారోపణలు లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సివిల్ సర్వీసెస్ అధికారులకు పాస్‌పోర్టు క్లియరెన్స్ ఇవ్వరాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయించింది. వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సివస్తే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అవినీతి కేసులో దొరికిపోయి, విచారణ పెండింగ్‌లో ఉన్నా.. ప్రభుత్వ విభాగం కేసు పెట్టినా, ఎఫ్ఐఆర్ నమోదైనా, సదరు అధికారి ప్రాథమిక విచారణ అనంతరం సస్పెన్షన్‌కు గురై ఉన్నా విజిలెన్స్ క్లియరెన్స్ నిరాకరిస్తారని పేర్కొంది. ఏదైనా క్రిమినల్ కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసినా, అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు ఆదేశాలు జారీ అయిన సందర్భాల్లో, సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి చార్జిషీట్ పెండింగ్‌లో ఉన్నా పాస్‌పోర్టు విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వబోరంది. -
అధికారుల షి‘కారు’!
కలెక్టరేట్లోని అక్షర ప్రణాళిక భవన్లో గల ఓ శాఖకు చెందిన ద్వితీయ శ్రేణి అధికారి ఒకరు.. తన రెండు కార్లను తాను పని చేస్తున్న శాఖలోనే అద్దెకు పెట్టాడు. ఆ శాఖలో కొన్నేళ్లుగా అవే వాహనాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను అద్దెకు పెట్టినట్లు సదరు శాఖ జిల్లా అధికారికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒక్క సదరు శాఖలోనే కాకుండా మరికొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులకు చెందిన వాహనాలనే ‘అద్దె’ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. కొంత మంది మండల స్థాయి అధికారులైతే నిబంధనలకు విరుద్ధంగా తెల్లరంగు నెంబర్ ప్లేట్ కలిగిన సొంత, బంధువుల కార్లను వాడుతున్నారు. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): అక్రమార్జన కోసం కొందరు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. వాహనాల అద్దెను కూడా అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. తాము పని చేస్తున్న సొంత శాఖల్లో కొందరు జిల్లా అధికారులు తమ సొంత వాహనాలను లేదా బంధువులవి పెట్టుకుని ‘అద్దె’ డబ్బులను నెక్కొస్తున్నారు. ఇటు మండల స్థాయిలోనూ తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, దండిగా వేతనాలు పొందుతున్న అధికారులే.. ఇలా అద్దె డబ్బులపై కన్నేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జిల్లాలో సుమారు 60 శాతం వరకు సొంత కార్లు, బంధువులవి అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయని సమాచారం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం కోసం అద్దె వాహనాలను పెట్టుకోవచ్చు. అయితే, సదరు వాహనాలకు పసుపు రంగు నెంబర్ (టాక్సీ) ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రంగు నెంబర్ (ప్రైవేట్) ప్లేట్ కలిగిన వాహనాలను వినియోగించకూడదని కచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ చాలా మంది అధికారులు తెల్ల రంగు నెంబర్ ప్లేట్ కలిగిన వాహనాలనే ఉపయోగిస్తూ ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అలాగే, అద్దె వాహనాలకు గతంలో 2500 కిలోమీటర్లు తిరిగినందుకు నెలకు రూ.25వేలు చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం దీనిని రూ.35 వేలకు పెంచింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచే ఆయా శాఖల్లో కొంత మంది జిల్లా అధికారులు అద్దె వాహనాలను వినియోగించకుండా సొంతవి లేదా బంధువులవి వినియోగిస్తున్నారు. డ్రైవర్ని పెట్టుకుని నెల నెల వేతనాలు చెల్లించగా, మిగతా డబ్బులు అధికారుల జేబుల్లోకి వెతున్నాయి. అదే విధంగా మండల స్థాయి అధికారులైన చాలా మంది తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా సొంత వాహనాలను బహిరంగంగానే వినియోగిస్తున్నారు. వీటికి కూడా తెల్లరంగు కలిగిన నెంబర్ ప్లేట్లే ఉన్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమ కార్యాలయాల్లో పని చేసే వీఆర్ఏలను, సిబ్బందిని డ్రైవర్లుగా పెట్టుకుని వాహనాలను నడిపిస్తున్న వారు కూడా కొందరున్నారు. మరి కొందరైతే డ్రైవర్‌కి వేతనం ఇచ్చే బదులు, వారే స్వయంగా వాహనాలను నడుపుతున్నారు. మండల స్థాయి అధికారులకు కలిసి వచ్చిన విషయం ఏంటం టే తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు ప్రభుత్వం నెల వారీగా అద్దె డబ్బులు విడుదల చేయదు. ఎనిమిది నెలలు, సంవత్సరానికి ఒకసారి నిధులను ఒకే సారి మంజూ రు చేస్తుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు అద్దెకు నడపడానికి ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో వారి సొంత కార్లను వినియోగిస్తున్నారు. -
రూ. కోటి సంగతి పట్టదేమీ..?
► రెండేళ్లుగా డీఎంహెచ్‌వో ఖాతాలో మూలుగుతున్న నిధులు ► పీహెచ్‌సీల్లో మందుల కొరతతో రోగుల ఇక్కట్లు ► అత్యవసర మందుల కొనుగోలుకు టెండర్లు కూడా పిలవని వైనం ► సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా దృష్టి సారించని వైనం గుంటూరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 83 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏటా వీటిలో మందుల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసినా, అవి చాలక అత్యవసర మందుల కొనుగోలుకు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే పీహెచ్‌సీల్లో అత్యవసర మందుల కొనుగోలుకు గాను జిల్లా వైద్యారోగ్యశాఖకు 2015లో ప్రత్యేకంగా సుమారు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర మందులు కొనుగోలు చేసి పీహెచ్‌సీలకు పంపాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు ఖాతాలోనే మురుగుతూ వచ్చాయి. గత డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో టెండర్లు.. 2015లో అప్పటి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి పద్మజారాణి టెండర్లు పిలిచినప్పటికీ వాటిని అప్పగించకుండానే వదిలేశారు. అప్పటి నుంచి నిధులు ఖాతాలో మూలుగుతున్నాయి. 2017 జనవరి 2న ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయగా ఫుల్ అడిషనల్ చార్జి తీసుకొని రెడ్డి శ్యామల ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇన్చార్జి పాలనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నడుస్తుండటంతో పాలన గాడితప్పింది. ఇన్చార్జి కావడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలూ లేకపోలేదు. కొచ్చర్ల పీహెచ్సీ నిర్లక్ష్యం వెలుగు చూసినా.. ఈపూరు మండలం కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ద్వారా వినుకొండకు మందులు పంపారు. తొమ్మిది నెలలుగా వాటిని వైద్యారోగ్యశాఖ అధికారులు తీసుకోకపోవడంపై ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ అప్పట్లో కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారిగా పనిచేసిన డాక్టర్ ప్రశాంతిని సస్పెండ్ చేశారు. డీఎంహెచ్‌వోకు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇంత జరిగినా వైద్యారోగ్య శాఖ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. రాజధాని జిల్లాలో పదిరోజులుగా వర్షాలు కురుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలినా మార్పు మాత్రం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పునరావాస కాలనీల గురించి పట్టించుకోరా?
► అధికారులపై జేసీ నాగలక్ష్మి ఆగ్రహం ► త్వరగా పూర్తిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక ఒంగోలు టౌన్ : గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో పనులు నత్తనడక సాగడంపై జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్ప నపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కాలనీల్లో నిర్మించనున్న ఆలయాలకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. రెండు మూడు ఆలయాల నిర్మాణాలను ఒక ప్యాకేజీ కింద టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మంచినీటి పథకాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు పూర్తయినందున వాటి నిర్వహణను సంబంధిత శాఖలు తీసుకోవాలన్నారు. పునరావాస కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వెలుగొండపై నివేదిక ఇవ్వాలి.. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాస కాలనీలకు సంబంధించి నివేదిక అందించాలని సంబంధిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నాగలక్ష్మి ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలన్నారు. అదేవిధంగా పునరావాస కాలనీల్లో మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి కచ్చితంగా పురోగతి కనిపించాలన్నారు. ఈ సమావేశంలో పీఏ టు స్పెషల్ కలెక్టర్ వెంకటరావు, గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉదయభాస్కర్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కరనాయుడు, కొండయ్య, ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ ఆలి, ప్రాజెక్టŠస్ ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
జిల్లాలో పనిచేసిన ప్రతి అధికారి ఆదర్శప్రాయుడే
► కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కడప అర్బన్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ కోసం, రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచేలా జిల్లా పోలీసు అధికారులు కృషి చేశారని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తూ నెల్లూరుజిల్లాకు బదిలీపై వెళుతున్న పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీగా పదోన్నతిపై వెళుతున్న బి.సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీగా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఓఎస్డీగా వెళుతున్న అన్బురాజన్, జిల్లాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గౌతమిసాలీలకు ఆదివారం కడప నగర శివార్లలోని మేడా కన్వెక్షన్ హాలులో వీడ్కోలు, సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీతోపాటు అధికారులకు పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ అంకితభావంతో ఎస్పీ రామకృష్ణ, మిగతా అధికారులు పనిచేసి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా చేశారన్నారు. జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాం గానికి ఎస్పీ రామకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగం, ప్రజలు, మీడియా తన విధులను చట్టపరంగా నిర్వర్తించేందుకు ఎంతో సహకరించారన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణలో తన వెన్నంటి ఉన్నారన్నారు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ పోలీసు అధికారుల సహకారంతో అనేక టాస్క్‌లను పూర్తి చేయగలిగామన్నారు. డీటీసీ బసిరెడ్డి మాట్లాడారు. అనంతరం అధికారులను సన్మానించారు. ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, షౌకత్ అలీ, సుధాకర్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, మహిళా అప్‌గ్రేడ్ డీఎస్పీ వాసుదేవన్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేంద్రుడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
దీక్ష.. పరీక్ష
► అధికారులు లేకపోవడంతో జనం అవస్థలు ► ఎక్కడి పనులు అక్కడే.. ► కార్యాలయాల చుట్టూ అవసరార్థుల ప్రదక్షిణ ► పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు ► పింఛనుదారులతో కార్యక్రమాలు నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వం పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాల్సిన అధికారులు కాస్తా కార్యాలయాలు వదిలి రోడ్ల వెంట తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఆరు రోజుల పాటు ఆఫీసుల ముఖం చూడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు కూడా దీక్షల కారణంగా రద్దు కావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావడం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను పావులుగా వాడుకుని ప్రభుత్వం తరపున ప్రచారం చేయిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నవ నిర్మాణ దీక్షల పేరిట అధికారులను రోడ్ల వెంట తిప్పడం.. కార్యక్రమాలకు జనం రాకపోవడంతో పింఛనుదారులతో మమ అనిపించడం జరిగింది. ఇక సమావేశాలు, సెమినార్లకు పొదుపు మహిళలు.. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లతో పాటు అన్ని శాఖల ఉద్యోగులను బలవంతంగా తరలించడం విమర్శల పాలయింది. కార్యక్రమాల్లో ప్రభుత్వ పనితీరును చెప్పడం తిప్పస్తే ప్రజల నుంచి ఒక్క వినతి కూడా తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా, డివిజన్, మండల అధికారులతో పాటు సిబ్బంది కూడా దీక్షల్లో పాల్పంచుకోవడం వల్ల ప్రజా సమస్యలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దీక్షల కోసం ఏకంగా విత్తనాల పంపిణీని నిలిపేయడం పట్ల రైతులు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ కీలకమైన సమయంలో దాదాపు వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉండటం అన్ని వర్గాల ప్రజల ఇబ్బందికి కారణమైంది. ఒకవైపు విత్తన పనులు ప్రారంభమయ్యాయి. మరో వైపు విద్యాసంవత్సరం మొదలు కానుండటంతో వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అడంగల్, 1–బి తదితరాల కోసం అనేక మంది రైతులు వచ్చి వెళ్తున్నారు. నీటి సమస్యలు, పశుగ్రాసం కొరత తదితరాలపై మండల పరిషత్ కార్యాలయాలకు నిత్యం అనేక మంది వస్తుంటారు. 2 నుంచి 7వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది నవనిర్మాణ దీక్షలకు వెళ్లడంతో వీరంత అనేక ఇబ్బందులు పడ్డారు. అధికారులు లేకపోవడం వల్ల ఎక్కడి పైళ్లు అక్కడే.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఉద్యోగల మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి తలెత్తింది. పరువు పోకుండా ఉండేందుకు తంటాలు నవనిర్మాణ దీక్షల కారణంగా పరువు పోకుండా ఉండేందుకు అధికారులు, దేశం నేతలు ఎంతో కష్టపడ్డారు. సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో బలవంతంగా తరలించి మరీ కూర్చోబెట్టారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు దీక్షా కార్యక్రమాల్లోనే పంపిణీ చేస్తామంటూ నమ్మబలికి రప్పించడం విమర్శలకు తావిచ్చింది. మరికొందరు కొత్త పింఛన్ల పేరిట మోసగించారు. మంత్రాలయం నియోజకవర్గంలోని బంటుపల్లి గ్రామానికి చెందిన వృద్ధులు, వితుంతువులను నవనిర్మాణ దీక్ష సమావేశానికి తరలించడానికి పింఛన్లు ఎర వేశారు. ఎమ్మిగనూరులో మంత్రాలయం నియోజక టీడీపీ ఇన్చార్జి ఉన్నారు.. ఆయనను కలిస్తే పింఛన్లు వస్తామని టీడీపీ నేతలు నిమ్మించారు. దీంతో వృద్ధులు, వితంతువులు అతి కష్టం మీద ఎమ్మిగనూరుకు వెళ్లి ఆయనను కలిశారు. అయితే మంత్రాయంలో జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి వస్తే పింఛన్లు వస్తాయని చెప్పడంతో అక్కడికీ వెళ్లారు. మొత్తంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి దీక్షకు వెళితే.. కార్యక్రమం ముగిశాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. నంద్యాలలో ఉద్యోగులు, పొదుపు మహిళలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను నిర్బంధంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్లొనేలా ఆదేశించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. డోన్ పట్టణంలోని ఎస్కేపీ హైస్కూల్ ఆవరణలో గురువారం నవ నిర్మాణ దీక్షల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అయితే పాల్గొన్న వారెవరూ బయటకు వెళ్లకుండా టీడీపీ నాయకులు స్కూల్ గేటుకు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. కౌన్స్లింగ్ ఉంది ఏం చేయాల్నో డిగ్రీ పూర్తయింది. పీజీ కౌన్సెలింగ్‌కు వెళ్లాలి. ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం మీ సేవలో అప్లై చేసి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న. అధికారులు, సిబ్బంది నవనిర్మాణ దీక్షలో ఉన్నారని ఆలస్యమౌతోంది. ఇప్పుడు సారోళ్లు వచ్చినా కౌన్సెలింగ్ లోపు సర్టిఫికెట్లు అందుతాయో లేదోనని టెన్షన్‌గా ఉంది. ఇన్చార్జి ఎవరైనా ఉన్నారా అంటే ఎవర్ని అడిగినా తహసీల్దార్ సార్ రావాల్సిందే అంటున్నారు. – రాజశేఖర్, రామళ్లకోట 2 నుంచి 7వ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాలు, హాజరైన ప్రజల వివరాలు ఇలా.. తేదీ సమావేశాలు/ సెమినార్లు హాజరైన ప్రజలు 2వ తేదీ – 16,330 3వ తేదీ 19 22915 4వ తేదీ 28 17662 5వ తేదీ 26 27391 6వ తేదీ 52 23457 7వ తేదీ 33 21251 మొత్తం 158 2,29,006 -
ఏసీబీ వలలో ఇద్దరు ఉద్యోగులు
కర్నూలు : ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బిందుబాయి(26), అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి. వెంకటేశ్వర్లు(52) ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డెత్ ఎక్స్‌గ్రేషియా ఫైల్‌పై సంతకం చేసేందుకు కృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద రూ.7 వేల లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. -
మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా
-
మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా
► అధికారులపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం: నగరంలోని మార్కెట్ యార్డ్‌లో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోమవారం మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్‌లు మార్కెట్ కమిటీ చైర్మెన్‌తో మాట్లాడారు. అనంతరం అధికారులను నిలదీసిన నాయకులు మీరు అధికారులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అని మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకు ముందు జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పత్తికి కనీసం రూ. 3 వేలు కూడా మద్దతు ధర కల్పించకపోవడం సర్కార్ వైఫల్యమే.. రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరడటం లేదని .. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నామన్నాని తెలిపారు. -
ఇక బదిలీల జాతర
► కోరుకున్న పోస్టింగ్‌లు రిజర్వ్ చేసుకుంటున్న అధికారులు ► అధికార పార్టీ నేతల సిఫారసుల కోసం ప్రదక్షిణలు ► మే నెలాఖరులో బదిలీలు జరగొచ్చని అంచనా సాక్షి ప్రతినిధి – నెల్లూరు: జిల్లాలో బదిలీల జాతర ప్రారంభం కాబోతోంది. మే నెలాఖరులోపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్థాయిలో ఈ ఫైలు కదలిక తెలుసుకున్న అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాదిలోనే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మండల, గ్రామ స్థాయిలో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులు, సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇక రెండేళ్లే గడువు ఉండటంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికార పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల అభీష్టం మేరకు బదిలీలు జరగబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం ప్రారంభమైంది. దీంతో పోలీసు, ఎంపీడీవో, తహసీల్దార్, హౌసింగ్, విద్యుత్, నీటి పారుదల సహా కీలకమైన ఇతర శాఖల అధికారులతో పాటు, ఉద్యోగులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు. అధికార పార్టీ నేతల అనుగ్రహం పొంది వారు అడిగినంత సమర్పించుకుని సీటు రిజర్వు చేసుకునే పనిలో పడ్డారు. ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి కాకపోయినా కోరుకున్న చోటికి బదిలీ చేయిస్తామని కొందరు నాయకులు అప్పుడే బేరాలు మొదలు పెట్టారు. హైవే స్టేషన్లకు డిమాండ్ తడ నుంచి కావలి దాకా ఉన్న హైవే పోలీసు స్టేషన్లతో పాటు గూడూరు, నెల్లూరు, కావలి పట్టణాల్లోని పోలీసు స్టేషన్ల ఎస్ఐలు, సీఐల పోస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎస్ఐ పోస్టుకు 2 నుంచి 3 లక్షలు, సీఐ పోస్టుకు రూ.5 నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు సంపాదించడానికి కొందరు సిద్ధమయ్యారు. బదిలీలు ప్రారంభమైతే ఫలానా స్టేషన్‌కు ఎవరినీ వేయించుకోవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను ముందుగానే కలుస్తున్నారు. రాష్ట్ర స్థాయి కేడర్ బదిలీలు కూడా జరిగితే జిల్లా నుంచి బయటకు పోకుండా ఉండటానికి డీఎస్పీ స్థాయి అధికారులు కూడా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎంపీడీవోలు, తహసీల్దార్ల పోస్టింగ్‌లకు పైరవీలు తమను బదిలీ చేయించుకుంటే ఎన్నికల్లో మీకు ఉపయోగపడతామని, మీరు చెప్పిన పనులు చేసి పెడతామని కొందరు ఎంపీడీవోలు, తహసీల్దార్లు అధికార పార్టీ నేతల చుట్టూ తిరగడం ప్రారంభించారు. జరగబోయే బదిలీలు పూర్తిగా రాజకీయ అవసరాల ప్రాతిపదికగానే ఉంటాయని.. ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల నుంచి సిఫారసు లేఖ తీసుకుంటే సరిపోతుందని వారు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతల అభీష్టం మేరకే బదిలీలు ఉంటాయని.. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వీరి లేఖల ఆధారంగానే బదిలీలు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. -
ఇష్టారాజ్యం
► అనుమతి ఒకచోట, పనులు చేసేది మరోచోట ► 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి ► నిద్రమత్తులో ఎస్ఈ, ఎంఈలు కడప నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా..? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? అక్రమార్జనే ధ్యేయంగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక చోట మంజూరైన పనులను వేరే చోట చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు సహకరించడమే ఇందుకు సాక్ష్యం. కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టే పనులకు కొన్ని నియమాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని ఇంజినీరింగ్ అధికారులు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఏవైనా పనులకు జనరల్ బాడీ ఆమోదంతో పాటు రీజినల్ స్థాయిలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి అనుమతి లభిం చాక ఆ పనిని మరొక చోట చేస్తామంటే కుదరదు. ఆ పని పేరు మార్చి వేరొక చోటికి బదలాయించడం అనేది కేంద్రప్రభుత్వ గ్రాంట్ల విషయంలో చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. నిబంధనలు తుంగలో తొక్కిన నగరపాలక ఇంజినీర్లు అలాంటి దాన్ని సులువుగా మార్చి పడేస్తున్నారు. కాలువ నిర్మాణం కోసమంటూ..: అక్కాయపల్లెలో సాయిబాబా స్కూల్ ఎదురుగా ఉన్నదంతా లోతట్టు ప్రాంతం. వర్షమొస్తే ఇక్కడ అనేక ఇళ్లు వాననీటిలో మునిగిపోతాయి. కల్వర్టు కూడా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీరు ప్రవహించేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతూ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.60లక్షలతో కాలువ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరయ్యాయి. కానీ నగర పాలక ఇంజినీరింగ్ అధికారులు మంజూ రైన చోట పనులు చేయకుండా వేరొకచోట మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన ఎస్ఈ, ఎంఈ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఆ పనిని వేరొకచోటికి బదలాయించి పనులు పూర్తి చేసేందుకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే..: కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కాగితాలపెంట నుంచి నబీకోట సర్కిల్ వరకూ బాగున్న డ్రైన్‌ను పగులగొట్టి ఆ స్థానంలో కొత్త డ్రైన్ కట్టినట్లు తెలుస్తోంది. పని పేరు మార్చకుండా పనులే మొదలుపెట్టడానికి వీల్లేదని నిబంధనలు చెబుతుంటే వీరేమో ఏకంగా ఆ పనులు కూడా పూర్తి చేసి బిల్లులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుండడం గమనార్హం. కాగా గతంలో ఇలాంటి పరిస్థితి రాగా అభ్యంతరం వ్యక్తం చేసిన నగరపాలక ఇంజినీర్లు ఇక్కడేమో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయిబాబా స్కూల్ ప్రాంతంలోని ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. వర్షం వస్తే తమగతేం కావాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక న్యాయవాది ఒకరు ఆర్టీ యాక్టు ప్రకారం సమాచారం కోరితే ఇంజినీరింగ్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నోట్ రాసి అనుమతి తీసుకుంటాం- ఎంఈ: దీనిపై మున్సిపల్ ఇంజినీర్ చెన్నకేశవరెడ్డిని వివరణ కోరగా ఈ డ్రైన్ కూడా ప్రజలకోసమే కదా, ఇందులో నిధులు దుర్వినియోగం ఏముందని ప్రశ్నిం చారు. నేమ్ చేంజ్ చేయకుండానే పనులు చేయవచ్చా అని ప్రశ్నించగా నోట్ రాసి అనుమతి తీసుకుంటామని తాపీగా సమాధానమిచ్చారు. -
సార్లకు సమయపాలనే లేదు
ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోని ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బందులుపడుతున్న కార్యార్ధులు చేజర్ల : చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి వేళకు రాకపోవడం షరామామూలే అయిపోయింది. దీంతో కార్యార్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్నీకావు. శుక్రవారం చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేయగా ఈ విషయం మరోమారు బయటపడింది. ఉదయం 10.30 గంటలైనా వెలుగు కార్యాలయం తలుపులు తీయలేదు. అదే సమయానికి వివిధ పనులపై ఈ కార్యాలయానికి అనేకమంది మహిళలు వచ్చారు. దీనిపక్కనే ఉన్న వ్యవసాయాధికారి కార్యాలయం తలుపులు ఉయదం 10:30 గంటలు దాటినా తీయలేదు. ఇన్పుట్ సబ్సిడీ వివరాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలకోసం వచ్చిన రైతులు కార్యాలయం పక్కనే పడిగాపులుకాస్తూ కనిపించారు. మామూలుగా తహసీల్దార్ కార్యాలయం ఉదయం 7, 8 గంటల నుంచే కిటకిటలాడుతూ ఉంటుంది. సిబ్బంది వచ్చేసి ఉంటారు. అయితే చేజర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10 గంటలకు అక్కడ ఒక్కరు కూడాలేరు. వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, విద్యార్థులు సర్టిఫికెట్లు వచ్చి ఎదురుచూశారు. వీఆర్వోల కోసం గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూడా వస్తునేఉన్నారు. అధికారులు, సిబ్బందిలో చాలామంది బయటిప్రాంతాలకు చెందినవారు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రీక్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
విత్తన పంపిణీలో సమస్యలు రానివ్వొద్దు
అనంతపురం: వేరుశనగ విత్తనాల పంపిణీపై జిల్లా అధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎన్ఐసీ సెంటర్ నుంచి నిర్వహించిన కార్యక్రమంలో 19 నుంచి పంపిణీ కార్యక్రమం సాఫీగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ విధానం గురించి, ఇతరత్రా సాంకేతిక అంశాల గురించి డీఐవో రామ్‌ప్రసాద్ పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు బమోమెట్రిక్‌తో పాటు ఒక ఐరిష్ కౌంటర్ ఏర్పాటు చేసి రైతులకు కూపన్లు ఇవ్వాలన్నారు. విత్తనకాయ ఇచ్చే గోడౌన్ దగ్గర సాయంత్రం 6 గంటల వరకు తెరచిఉంచాలని ఆదేశించారు. బ్యారికేడ్లు, శామియానా, నీరు, మజ్జిగ కేంద్రాలు, వైద్యం, బందోబస్తు ఏర్పాట్లు సమక్రంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా డివిజన్ ఏడీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజువారీ నివేదికలు జేడీఏ కార్యాలయానికి పంపాలన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
ఆదిలాబాద్ : ప్రభుత్వాలు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్న గ్రామాల్లో బాల్య వివాహాలు ఆగడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మూడు బాల్య వివాహాలను శనివారం అధికారులు అడ్డుకున్నారు. భిమిని మండలం రిగాం గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను చూసి అవాక్కయ్యారు. ఒకే రోజు ముగ్గురు మైనర్ బాలికలకు వివాహాలు జరుపుతుండటంతో.. పోలీసులు బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను రద్దు చేశారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఈ నెలలో మూడో సారి అని రెవెన్యూ అధికారులు తెలిపారు. బాల్య వివాహాలకు పాల్పడుతున్న వారందరు ఒకే వర్గానికి చెందిన వారిగా గుర్తించిన రెవెన్యూ అధికారులు వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు.