అనంతపురం: వేరుశనగ విత్తనాల పంపిణీపై జిల్లా అధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ సెంటర్ నుంచి నిర్వహించిన కార్యక్రమంలో 19 నుంచి పంపిణీ కార్యక్రమం సాఫీగా జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ విధానం గురించి, ఇతరత్రా సాంకేతిక అంశాల గురించి డీఐవో రామ్‌ప్రసాద్ పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు బమోమెట్రిక్‌తో పాటు ఒక ఐరిష్ కౌంటర్ ఏర్పాటు చేసి రైతులకు కూపన్లు ఇవ్వాలన్నారు. విత్తనకాయ ఇచ్చే గోడౌన్ దగ్గర సాయంత్రం 6 గంటల వరకు తెరచిఉంచాలని ఆదేశించారు. బ్యారికేడ్లు, శామియానా, నీరు, మజ్జిగ కేంద్రాలు, వైద్యం, బందోబస్తు ఏర్పాట్లు సమక్రంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా డివిజన్ ఏడీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజువారీ నివేదికలు జేడీఏ కార్యాలయానికి పంపాలన్నారు.
విత్తన పంపిణీలో సమస్యలు రానివ్వొద్దు
Published Wed, May 18 2016 9:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement