
ఏసీబీ వలలో ఇద్దరు ఉద్యోగులు
కర్నూలు : ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బిందుబాయి(26), అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి. వెంకటేశ్వర్లు(52) ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డెత్ ఎక్స్‌గ్రేషియా ఫైల్‌పై సంతకం చేసేందుకు కృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద రూ.7 వేల లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.