
కొంతమంది అధికారులు అధికారపార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు.
సాక్షి, నరసరావుపేట: ‘నేను మూర్ఖుడిని.. తగ్గేదే లేదు. అందరి పేర్లూ ఎర్ర బుక్‌లో రాసుకుంటున్నా. ఎవర్నీ వదలను.. టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అంటూ వినుకొండలో జరిగిన బహిరంగసభలో టీడీపీ నేత నారా లోకేశ్ హెచ్చరించారు.
యువగళం పాదయాత్ర బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం, పట్టణంలో సాగింది. కొంతమంది అధికారులు అధికారపార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు. 2019–24 మధ్య ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే.. అధికారంలోకి వచ్చాక అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని టీడీపీ కార్యకర్తలకు లోకేశ్ సూచించారు.
చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’