narasarao pet
-
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్
పల్నాడు జిల్లా: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణమురళిపై నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో కేసు నమోదు చేశారు పోలీసులు. మార్చి మొదటి వారంలో పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో పోసాని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు
నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు. చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్‌లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్‌లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు. నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్‌లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ -
నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్
సాక్షి, నరసరావుపేట: ‘నేను మూర్ఖుడిని.. తగ్గేదే లేదు. అందరి పేర్లూ ఎర్ర బుక్‌లో రాసుకుంటున్నా. ఎవర్నీ వదలను.. టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అంటూ వినుకొండలో జరిగిన బహిరంగసభలో టీడీపీ నేత నారా లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్ర బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం, పట్టణంలో సాగింది. కొంతమంది అధికారులు అధికారపార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు. 2019–24 మధ్య ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే.. అధికారంలోకి వచ్చాక అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని టీడీపీ కార్యకర్తలకు లోకేశ్ సూచించారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ -
నేను కొట్టలేదు అంతా అవాస్తవం: నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్ రావు
-
ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం: ఎస్పీ
-
ఇప్పుడు ‘సేఫ్’ కాదని..
సాక్షి, నరసరావుపేట(గుంటూరు): కోడెల కుటుంబానికి ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే, ఇచ్చిన సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే కాళ్లావేళ్లా పడాల్సిందే.. వాళ్ల బెదిరింపులకు లొంగి ఉండాల్సిందే.. అలా కాదని ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో జైలుకు వెళతారు. లేదంటే భౌతిక దాడులకు గురవుతారు. ఇదంతా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధికారం అండతో కోడెల కుటుంబం సాగించిన దందా. అయితే ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితి పూర్తిగా అడ్డం తిరిగింది. అధికార అహంకారంతో నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఏదైనా గేటు అవతల ఉండి మాట్లాడమని గద్దించిన నోళ్లు మూతబడ్డాయి. రాజీకి రండంటూ బాధితులను వేడుకుంటున్నాయి. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మి వ్యవహారంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆనాడు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో ప్రభుత్వం మారిన తర్వాత కేట్యాక్స్ బాధితులంతా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కోడెల కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదవటంతో కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి పరారయ్యారు. వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కేసుల్లో ఉన్న తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం సైతం బెయిల్‌ను నిరాకరించింది. దీంతో బాధితుల వద్ద నొక్కేసిన సొమ్మును వెనక్కి ఇచ్చి రాజీలు చేసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమ తరలింపు వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడెల కుటుంబం నవ్వులపాలైంది. చివరకు ఆ పార్టీ నాయకులు, సొంత సామాజికవర్గం సైతం చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పోలీసులు కూడా అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో సర్జికల్ వ్యాపారికి ఇవ్వాల్సిన నగదుకు ఎగనామం పెట్టిన కోడెల కుమార్తె తాజాగా ఆ వ్యాపారిని పిలిచి మరీ నగదు చెల్లించడం గమనార్హం. తిన్నది కక్కించారు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన చల్లా రవీంద్రరెడ్డి ఆ గ్రామంలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సర్జికల్ కాటన్‌ను కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీకి సరఫరా చేశారు. అందుకుగాను సుమారు రూ.15 లక్షలు రవీంద్రరెడ్డికి కోడెల కుమార్తె కంపెనీ నుంచి రావాల్సి ఉంది. నగదు కోసం పలుమార్లు ఆమెను కలిసి అడగ్గా బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు మూడు రోజుల క్రితం గుంటూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం సైతం కేట్యాక్స్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తుండటంతో మరో దారి లేక ఆయనకు ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి విజయలక్ష్మి సంతకం చేసిన రూ.14.40 లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులను శుక్రవారం సేఫ్ కంపెనీ మేనేజర్ అందజేశారు. తండ్రి బాటలోనే తనయ అక్రమాలు చేయటం, వాటిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిదిద్దుకోవటంలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అందె వేసిన చేయిగా చెప్పుకుంటారు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం బయట పడగానే.. తీసుకున్న ఫర్నిచర్‌కు డబ్బులు చెల్లిస్తానని బుకాయించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి వెంకటేశ్వర సర్జికల్ కాటన్ యజమాని రవీంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు ముట్టచెప్పి కేసు మాఫీకి యత్నించడం గమనార్హం. -
కోడెల కుమార్తెపై ఫిర్యాదు
-
కోడెల కుమార్తెపై కేసు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. చదవండి: (కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు) రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. -
టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు
గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావు పేట మండలంలో పమిడిపాడులో శుక్రవారం కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో ఈ రోజు ఉదయం బాంబులు పేలాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పేలుడు పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాంబులు పేలుడు కు సంబందించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పొలం తగాదాలో దాడి: రైతు మృతి
నరసారావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట శివారులో పొలం తగాదా విషయమై ప్రత్యర్థులు దాడి చేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. అన్నం లక్ష్మీనరసింహారావు, బాజీ అనే వ్యక్తుల మధ్య గతకొంత కాలంగా పొలం వివాదం ఉంది. మంగళవారం రాత్రి లక్ష్మీనరసింహారావుకు చెందిన గేదె బాజీ కి చెందిన పొలంలోపడి మేసింది. అది చూసిన బాజీ దాన్ని కట్టేశాడు. ఈ విషయం అడిగేందుకు బుధవారం ఉదయం వెళ్లిన లక్ష్మీనరసింహారావుపై బాజీ, అతని అనుచరులు దాడిచేశారు. ఈ దాడిలో లక్ష్మీనరసింహారావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ణి ఆస్పత్రిల్లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతను మృతిచెందాడు. -
గుంటూరు జిల్లాలో ఏసీబీ దాడులు
నరసరావుపేట: గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్ బిల్లు మంజూరుకు లంచం అడగటంతో సదరు చిరుద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏరియా వైద్యశాలలో జూనియర్ శానిటరీ వర్కర్‌గా విధులు నిర్వహించే తలమాల దుర్గారావుకు పది రోజుల క్రితం రూ.62,500లు ఇంక్రిమెంట్ ఎరియర్స్ కింద మంజూరయ్యాయి. వాటికి సంబంధించి బిల్లు పాస్‌చేసి చెక్కు ఇచ్చేందుకు వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ కె.నరేంద్రబాబు రూ.15వేల లంచాన్ని డిమాండ్ చేశారు. దీంతో దుర్గారావు రూ.5వేలకు బేరం కుదుర్చుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్రబాబు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది'
గుంటూరు: టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి బిహార్‌లో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో యమునా నది నీళ్లు, పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన విషయం తరెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అంతకుముందు ఇచ్చిన వరాలపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: చిన్నపిల్లలు తిరుగుతున్నారు .. జాగ్రత్తగా ద్విచక్రవాహనాలు నడపండి అన్న పాపానికి ఆదివారం దొండపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి వెళ్లే క్రమంలో ద్విచక్రవాహనాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కాగా చిన్న పిల్లలున్నారు .. జాగ్రత్తగా వాహనాలు నడపమని హితవు పలికిన పాపానికి గ్రామానికి చెందిన ముచ్చుమర్రు వెంకటసుబ్బారెడ్డి, అతని కుమారుడు వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిలపై దాడి చేసి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు జక్కిరెడ్డి నాగేశ్వరరెడ్డి, చిన్నపరెడ్డి నరేంద్రరెడ్డి, చిన్నపరెడ్డి హనిమిరెడ్డి, జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నవులూరి తిరుపతిరెడ్డిలపై కూడా దాడి చేశారు. దాడిలో ముచ్చుమర్రు వెంకటరెడ్డి, ముచ్చుమర్రు వెంకటసుబ్బారెడ్డి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గ్రామస్తులు ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. వీరి తండ్రి ముచ్చుమర్రు వెంకట సుబ్బారెడ్డికి చెయ్యి విరిగింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏరియా వైద్యశాలకు తరలివచ్చి బాధితులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల నుంచి నరసరావుపేట నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని, ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందన్న అహంకారంతో కొందరు గ్రామాల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులను పరామర్శించిన వారిలో రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దేశిరెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నూరుల్ అక్తాబ్, మూరె రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆరోగ్య ప్రాప్తిరస్తు..!
నేటి సమాజం పెద్దల మాటలను చద్దిమూటలుగా తీసిపారేసి... కొత్తొక వింత అన్నట్టుగా వేలంవెర్రిగా వింతపోకడలు పోతోంది. మన ఆరోగ్యం కోసం పతంజలి ఏనాడో రాసిపెట్టిన యోగ శాస్త్రాన్ని విస్మరించి తలనొప్పి వచ్చినా...కడుపునొప్పి వచ్చినా...ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు,లక్షలు వదిలించుకుంటున్న మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడాలి. యోగశాస్త్రంలో ఏ ఆసనం వేస్తే ఏ రోగం తగ్గించుకోవచ్చో కూడా వివరంగా ఉంది. చక్రాసనం వేస్తే చాలు గుండెజబ్బును ఆమడదూరంలో ఉంచవచ్చు. భుజంగాసనం వేస్తే శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడక్కరలేదు. పశ్చిమోత్తాసనం వేస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పవనముక్త ఆసనం వేస్తే గ్యాస్ ట్రబుల్ బలాదూర్..పంచిమూతన ఆసనం వేస్తే మధుమేహం పరార్..ఇలా ఆసనాలతోనే రోగాలను తరిమివేసే అద్భుత శాస్త్రం మన చేతుల్లోనే ఉంది. ఇక మనమూ ఆసనాలు వేద్దామా మరి... నరసరావుపేట ఈస్ట్, న్యూస్‌లైన్ : భారతదేశ సంస్కృతిలో యోగా ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనానికి ఉపయుక్తం కలిగించేందుకు భారతదేశం అందించిన అత్యుత్తమమైన శాస్త్రాలలో యోగశాస్త్రం ప్రముఖమైంది. పూర్వం పతంజలి మహర్షి యోగశాస్త్రను రచించారు. అందులో ఒక భాగమే యోగాసనాలు. భూమి పైన 84 లక్షల జీవరాసులుంటే, 84 రకాల ఆసనాలున్నాయి. వీటిలో స్త్రీ, పురుషులు సులభంగా చేయగలిగే యోగాసనాలు (భంగిమలు) 42 వరకు ఉన్నాయని యోగాసనాల శిక్షకులు చెబుతున్నారు. ప్రతి ఆసనానికి దేనికదే దాని ప్రత్యేకతలు, పద్ధతులు ఉన్నాయి. యోగ సాధన ద్వారా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, విజ్ఞానం ప్రాప్తిస్తాయి.యోగాకు తోడు ప్రాణాయామం, ధ్యానం చేయడంతో మానవ జీవితం ఆనందంగా ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారు సైతం సాధన చేయవచ్చు.యోగావల్ల ఎటువంటి రోగాలైనా త్వరితంగా అధీనంలోకి రావడంతోపాటు మరికొంత సాధనతో పూర్తిగా తగ్గించుకోవచ్చని యోగాచార్యులు చెబుతున్నారు. యోగాసనాలపై అందరికి అవగాహన కల్పిస్తూ, ఉచితంగా నేర్పిస్తున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగా యోగం అంటే కలయిక. యోగా శారీరక, మానసిక, బుద్ధిపరమైన రుగ్మతలను తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. యోగాసనాల ద్వారా శరీరంలోని కండరాలకు వ్యాయామం అవుతుంది. నిత్యం యోగా సాధన ద్వారా రోగనిరోధకశక్తి పెరిగి, శారీరక రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతకు, బుద్ధి మాంద్యం తగ్గించడంతో పాటు ఆధ్మాత్మికోన్నతికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ యోగా పట్ల ఆసక్తిని చూపుతున్నాయి. 84 రకాల యోగాసనాలు యోగాసనాలు (భంగిమలు) మొత్తం 84 ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 42 రకాల ఆసనాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నిత్యం బ్రహ్మీ ముహూర్తం (ఉదయం 3-6 గంటలమధ్య) సమయంలో యోగసాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఆయుర్వేద, హోమియో, ఇంగ్లిష్ మందుల అవసరం లేకుండానే కేవలం యోగసాధన ద్వారానే బి.పి, షుగర్, ఆస్తమ, గ్యాస్, నడుమునొప్పి, ైథైరాయిడ్, స్త్రీ రుతుక్రమ దోషాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చని యోగా మాస్టర్లు గట్టిగా చెబుతున్నారు. ఏ వ్యాధికి ఏ ఆసనం ఉపయుక్తం..? వివిధ శారీరక రోగాలకు వివిధ భంగిమలలో సాధన చేయాల్సి ఉంటుంది. మధుమేహం(షుగర్)కు - పంచిమూతన ఆసనం, గ్యాస్ట్రబుల్కు - పవనముక్త ఆసనం, గుండెజబ్బుకు - చక్రాసనం, శ్వాసకోస వ్యాధులకు - భుజంగాసనం, జీర్ణక్రియకు - పశ్చిమోత్తాసనం, ఉబ్బసం - ఉష్ట్రాసనం, మలబద్దకానికి - ఉదరాకర్షణాసనం, శరీరంలో రక్తప్రసరణకు మయూరాసనం, థైరాయిడ్ సమస్యలు, సర్వఅంగాల ఉత్తేజానికి సర్వాంగాసనం, నడుములో కొవ్వును తగ్గించుకోవడానికి - త్రికోణాసనాలను సాధన చేయాలంటారు గురువులు. వీటితోపాటు పెరాలసిస్, ఫిట్స్, కిడ్నీ, మొండిరోగాలైన చర్మవ్యాధులు సైతం ఆసనాలతో దూరం అవుతాయని చెబుతారు. ఆసనాలతో పాటుగా సుఖప్రాణాయామం, నాడీశోధన ప్రాణాయామం, బస్త్రిక ప్రాణాయామం సాధనవల్ల మానసిక ప్రశాంతత పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా యోగసాధన చేయదలచినవారు ముందుగా యోగాలో మంచి శిక్షణ తీసుకున్న మాస్టర్స్ వద్ద కొంతకాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. యోగాతో అన్ని రుగ్మతలు తొలుగుతాయి యోగసాధనతో శారీరక, మానసిక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. వత్తిడిని జయించవచ్చు, చక్కని నిద్రకు, బరువు తగ్గడానికి యోగా ఉపయోగపడుతుంది. యోగభంగిమలతో సకల రోగాలను దూరం చేసుకోవచ్చు. గత 12 ఏళ్లుగా నిత్యం యోగాసనాలలో శిక్షకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పటికీ 114 యోగశిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి, వేలమందికి శిక్షణ ఇచ్చాము. -కూనిశెట్టి వెంకట జనార్ధన్ గురూజీ,శ్రీవెంకటేశ్వర యోగసేవాకేంద్రం, పరికల్ప యోగి -
కోడెల మరో ఎత్తుగడ
నరసరావుపేటలో మళ్లీ పాదయాత్రకు సన్నాహాలు సత్తెనపల్లి వెళ్లేందుకు సమ్మతికానందునే... టిక్కెట్టుకోసం అక్కడి ఇన్చార్జి సైతం డిమాండ్ అవసరమైతే ఆత్మహత్యకైనా సిద్ధమేనని హెచ్చరిక అగమ్యగోచరంలో పార్టీ కేడర్ సాక్షి ప్రతినిధి, గుంటూరు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఎవరు తమతమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. నరసరావుపేటపైనే తొలినుంచీ ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావును సత్తెనపల్లి వెళ్లాలని అధినేత చంద్రబాబునాయుడు చెప్పడంతో ఆయన అభిమానులు ఆత్మహత్యలకు సైతం ఉపక్రమించారు. అయినా తప్పదని అధినేత మాటకు కట్టుబడి తాను సత్తెనపల్లి వెళ్లాల్సిందేనని వారికి నచ్చజెప్పారు. అయితే సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్న అక్కడి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ తనకు ఆ స్థానంనుంచి అవకాశం కల్పించకుంటే తానూ ఆత్మహత్యకు వెనుకాడనని ఖరాఖండీగా చెప్పడంతో కార్యకర్తల్లో అయోమ యం నెలకొంది. ఇక మంత్రి కోడెల పరిస్థితి అయితే ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే రీతిగా మారిం ది. దీంతో ఎలాగైనా నరసరావుపేటలోనే తాను పోటీ చేయాలని అంతర్గతంగా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా మళ్లీ ఈ నెల 23నుంచి త్మీయయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ యాత్ర ద్వారా ప్రజల్లో మమేకం అయ్యేందుకు, తనకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పార్టీకి మూల స్తంభంగా నిలిచిన కోడెల పరిస్థితే ఇలా తయారైతే... మిగిలినవారి గతేమిటని కార్యకర్తలు గుసగు సలాడుకుంటున్నారు -
సినిమా కష్టాలు
సాక్షి, నరసరావుపేట: ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఓ వినోదం. వారంతమో లేక ఆటవిడుపుగానో మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు తమ కష్టాలను మర్చిపోవడానికి కుటుంబ సమేతంగా సినిమాలకు వెళుతుంటారు. గుంటూరు నగరంతోపాటు, జిల్లాలోని చిన్నచిన్న పట్టణాల్లో ఎలాంటి మెరుగైన రిక్రియేషన్ క్లబ్‌లు కానీ, పార్కులు కానీ లేకపోవడంతో ప్రజలు సేదతీరడానికి, కాలక్షేపం చేయడానికి సినిమా మినహా వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఇది ప్రజల తప్పనిసరి అవసరంగా మారింది. దీన్ని సినిమా థియేటర్ల నిర్వాహకులు పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు నలుగురు కలిసి సినిమాకు వెళితే రూ. 600లు కచ్చితంగా ఖర్చు కావాల్సిందే. సినిమాకు వెళ్తే జేబులకు చిల్లు పడుతుండటంతో మధ్యతరగతి, పేద ప్రజలు నెలకు ఒక సినిమా కూడా చూడలేక పోతున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం నామమాత్రంగానైనా సౌకర్యాలు, వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. వినోదం కోసం సినిమాకు వెళ్లిన ప్రజలు కష్టాలపాలవుతున్నారు. గుంటూరు నగరంలో సుమారు 25 సినిమా థియేటర్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 100 వరకు ఉన్నాయి. సినిమా హాళ్లల్లో వసతులు, సౌకర్యాలపై తరచూ సమీక్షిస్తుండటం, ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తే స్పందించి చర్యలు తీసుకోవడం, టికెట్ల విషయం, క్యాంటిన్లో తినుబండారాలు, సినిమా హాళ్లల్లో పారిశుధ్యం నిర్వహణ, వాహనాల పార్కింగ్ ధరలు ఇలా అన్ని అంశాలపై ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవి జిల్లాలో ఎక్కడా మచ్చుకైనా అమలు కావడం లేదు. అదే రీతిలో ఉన్నతాధికారులు సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. గుంటూరు నగరంలో అత్యధిక శాతం సినిమా హాళ్లు ఏసీ కలిగి ఉన్నాయి. ముఖ్య పట్టణాల్లో ఉన్న సినిమా హాళ్లలో సైతం కొన్ని ఏసీ ఉన్నాయి. అయితే వీటిలో అధికశాతం హాళ్లలో ఏసీలు పనిచేయకపోవడం, సరైన సీటింగ్ వసతి లేకపోవడం ఇలా సమస్యలు కోకోల్లలు. ప్రధానంగా కొత్త సినిమా రిలీజ్ అయితే హాలు యజమానులే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మించి లాభపడుతున్నారు. దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. నిబంధనలకు అనుగుణంగా టికెట్ల ధరలు ఉండవు, రెట్టింపు ధరలకు అమ్ముతుంటారు. సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అంటే అదీ లేదు. బైక్ పార్కింగ్‌కు రూ. 15లు వసూలు చేస్తున్నారు. థియేటర్ లోపల సినిమా మొదలవగానే వేసిన ఏసీ ఇంటర్వెల్ తరువాత ఏ హాలులో పనిచేయదు. అదేమని ప్రేక్షకుడు ప్రశ్నిస్తే సినిమా చూస్తే చూడు లేకపోతే పో అని బెదిరించడం సర్వసాధారణమే. ఇక తినుబండారాల విషయానికొస్తే క్యాంటిన్ రేట్లు నింగినంటుతాయి. ప్రతిదానిపై సగటున రూ. 3 నుంచి రూ. 10 ల వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. అంత ధర తీసుకున్నా నాణ్యమైన ఆహారాన్ని మాత్రం అందించరు. చిన్న పిల్లల కోసమని వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఆహారం తీసుకెళితే వారిపై ధ్వజమెత్తి నానా హంగామా చేసి తీసుకెళ్లిన పదార్థాలను బయట పారవేయి ంచడం, లేదా, బయట తిన్న తరువాత లోనికి అనుమతించడం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి సినిమా హాలులో అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ, ఆహార పదార్థాల విక్రయాలపై రెవెన్యూ యంత్రాంగంతో పాటు నగరపాలక సంస్థ, అగ్నిమాపక , కార్మిక, తూనికలు కొలతల విభాగం తదితర శాఖలన్నీ పర్యవేక్షిస్తుండాలి. కానీ ఆయా శాఖల అధికారులు కొత్త సినిమా టికెట్లు తీసుకుని చూసీచూడనట్లు పోతున్నారనే విమర్శలు లేకపోలేదు. సినిమాహాళ్లపై ఫిర్యాదులుఅందుతున్నాయని నరసరావుపేట ఆర్డీఓ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలుపాటించాలని ఇప్పటికే యాజమాన్యానికి చెప్పామని, వారితో సమావేశాలు నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న థియేటర్లను సీజ్ చేస్తామని చెప్పారు.