పొలం తగాదాలో దాడి: రైతు మృతి
Published Wed, Mar 16 2016 12:23 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
నరసారావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట శివారులో పొలం తగాదా విషయమై ప్రత్యర్థులు దాడి చేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. అన్నం లక్ష్మీనరసింహారావు, బాజీ అనే వ్యక్తుల మధ్య గతకొంత కాలంగా పొలం వివాదం ఉంది. మంగళవారం రాత్రి లక్ష్మీనరసింహారావుకు చెందిన గేదె బాజీ కి చెందిన పొలంలోపడి మేసింది. అది చూసిన బాజీ దాన్ని కట్టేశాడు. ఈ విషయం అడిగేందుకు బుధవారం ఉదయం వెళ్లిన లక్ష్మీనరసింహారావుపై బాజీ, అతని అనుచరులు దాడిచేశారు. ఈ దాడిలో లక్ష్మీనరసింహారావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ణి ఆస్పత్రిల్లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అతను మృతిచెందాడు.
Advertisement
Advertisement