మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాత్పురా భవన్‌లోని మూడో అంతస్తులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విలువైన ధ్రువపత్రాలు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు. సెలవు దినమైనందున ఎవరూ కార్యాలయానికి వెళ్లలేదని పేర్కొన్నారు.
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఫోన్‌లో ప్రమాదం గురించి వివరించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అన్ని విధాలు సహాయం అందుతుందని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన సాత్పుర భవన్‌లో మంటలు చెలరేగడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ అవినీతి భయటపడుతుందనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించాయి. ఎలాగూ వచ్చేసారి అధికారంలోకి రాలేమనే భయం అధికార పార్టీకి పట్టుకుందని విమర్శించాయి.
Comments
Please login to add a commentAdd a comment