న్యూఢిల్లీ: నేరారోపణలు లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సివిల్ సర్వీసెస్ అధికారులకు పాస్‌పోర్టు క్లియరెన్స్ ఇవ్వరాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయించింది. వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సివస్తే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అవినీతి కేసులో దొరికిపోయి, విచారణ పెండింగ్‌లో ఉన్నా.. ప్రభుత్వ విభాగం కేసు పెట్టినా, ఎఫ్‌ఐఆర్ నమోదైనా, సదరు అధికారి ప్రాథమిక విచారణ అనంతరం సస్పెన్షన్‌కు గురై ఉన్నా విజిలెన్స్ క్లియరెన్స్ నిరాకరిస్తారని పేర్కొంది. ఏదైనా క్రిమినల్ కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసినా, అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు ఆదేశాలు జారీ అయిన సందర్భాల్లో, సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి చార్జిషీట్ పెండింగ్‌లో ఉన్నా పాస్‌పోర్టు విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వబోరంది.
Comments
Please login to add a commentAdd a comment