ఎంపీ నిమ్మల కిష్టప్ప మా భూమి కబ్జా చేశాడు
ఎంపీ నిమ్మల కిష్టప్ప మా భూమి కబ్జా చేశాడు
Published Mon, Oct 17 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
అనంతపురం సెంట్రల్ : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తమ భూమిని కబ్జా చేశాడని, న్యా యం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని గోరంట్ల మండలం బూదిలి గ్రా మానికి చెందిన మల్లేçశప్ప, కదిరప్ప కుటుంబసభ్యు లు వాపోయారు. సోమవారం రెవెన్యూభవన్‌లో జ రుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కదిరప్ప, మల్లేసు కుటుం బసభ్యులు లక్ష్మీదేవి, హరీష్‌కుమార్, మీనాక్షి, కమ ల, దినేష్ మాట్లాడుతూ బూదిలి గ్రా మ పొలంలో స ర్వేనెంబర్ 476 లో 4.32 సెంట్లు, 3.30 సెంట్లు హిం దూపురం ఎంపీ నిమ్మలకిష్టప్ప కుమారులు నిమ్మల శిరీష్, నిమ్మల ఆమ్రేష్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. రెవెన్యూ అధికారుల అండతో వెబ్‌ల్యాండ్‌లో తమ పే ర్లను తొలగించారని వారు ఆవేద న వ్యక్తం చేశారు. అలాగే ఆయన అనుచరులు చంపేస్తామని బెదిరి స్తున్నారన్నారు. భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీని ఇప్పించండి
నగరంలో పాతూరులోని ప్రభాకర్‌స్కూల్, అబ్దుల్‌కలాం ఉర్దూ స్కూల్, కస్తూరిబా మున్సిపల్‌స్కూల్స్‌కు మధ్యాహ్న భోజన ఏజెన్సీ బాధ్యతలు ఇప్పించాలని అంబారపు వీధికి చెందిన జె.రమణమ్మ, జేసీ చలపతి దంపతులు ప్రజావాణిలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. 12 సంవత్సరాలు ఏజెనీస నిర్వహిస్తున్నామని, ఇటీవల ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని వారు ఫిర్యాదు చేశారు.
Advertisement