
కదిరి: అనంతపురం జిల్లా కదిరికి చెందిన మాజీ సైనికుడు అల్లా బక్ష్ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ సురయాభాను భర్త బాబ్‌జానే తన చావుకి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. అల్లా బక్ష్‌కు నేహా ఫంక్షన్ హాల్ దగ్గర సర్వే నం.800లో 12 సెంట్ల స్థలం ఉంది. ఆ పక్కనే 3 సెంట్ల వంక పోరంబోకు స్థలం ఉంది. చైర్మన్ భర్త బాబ్‌జాన్ ఆ స్థలాన్ని కబ్జా చేసి బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయించుకున్నారు.
విషయం తెలుసుకున్న అల్లా బక్ష్.. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా బలవంతంగా తరలించేశారు. మనస్తాపం చెందిన అతడు గురువారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన భార్య వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. బాబ్‌జాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీకే చెందిన కౌన్సిలర్ మైనుద్దీన్ తదితరులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment