- హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో చేరిక
వైఎస్సార్ సీపీలోకి పోలు విజయలక్ష్మి
Published Fri, Nov 4 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి అన్న కుమార్తె, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ కార్పొరేటర్ తామరాడ సుశీల, టీడీపీ 29వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, జాంపేట పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, రాజమహేంద్రవరం తమిళ సంఘం అధ్యక్షుడు మొహిద్దీన్ పిచ్చయ్య పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేశారు. హైదరాబద్ లోటస్‌పాండ్‌లో వారికి జగన్‌పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీ పటిష్టతకు కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలు విజయలక్ష్మి ’సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్‌ారజు, గిరజాల బాబు, పలు విభాగాల నేతలు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సుంకరచిన్ని, గుర్రం గౌతమ్, తాడి విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ చీఫ్ విప్ మింది నాగేంద్ర, విప్ బాపన సుధారాణి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, నేతలు అడపా శ్రీహరి, ఆర్‌వీ సత్యనారాయణ చౌదరి, జక్కంపూడి గణేష్, బొప్పన ప్రసాద్, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement