వైఎస్సార్‌ సీపీ గూటికి 50 మంది యువత | 50 members joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ గూటికి 50 మంది యువత

Published Thu, Jul 21 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

వైఎస్సార్‌ సీపీ గూటికి 50 మంది యువత

వైఎస్సార్‌ సీపీ గూటికి 50 మంది యువత

పెద్దాపురం :  పట్టణానికి చెందిన సుమారు 50 మంది యువకులు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. కొత్తపేట, 28వ వార్డుకు చెందిన నేల ప్రసాద్‌ ఆధ్వర్యంలో నేల ప్రభాకర్, ఆదిరెడ్డి ఉదయ్‌శంకర్, ఆదిరెడ్డి లోకేష్, వీరసాయి, వి.సాయి, డి.రాజేష్, పి.స్వామి,  తోట నాని, బోడా రవి, ముంగి సూర్య (సెల్‌æపాయింట్‌),  టి.పాపారావు (సెల్‌ పాయింట్‌), వి.నవీన్, కె.ముత్యాలరావు, ఎం.విష్ణు, కె.దుర్గ, నేల నాగరాజు, రాము, ఎ. గణేష్, వాసంశెట్టి నాగేశ్వరరావు, ఒకటో వార్డుకు చెందిన చిమ్మ అప్పలనాయుడు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నాయకులు శివ, గోపు మురళీ, శేషుల సమక్షంలో  వారంతా పార్టీలోకి ప్రవేశించారు. మహానేత రాజశేఖరరెడ్డి పాలన కోసం శ్రమిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.  పార్టీలో చేరిన యువకులందరికీ సుబ్బారావు నాయుడు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి రమేష్‌రెడ్డి, పార్టీ పట్ణణశాఖ అధ్యక్షులు కాపగంటి కామేశ్వరరావు, పట్టణ నాయకులు నాగిరెడ్డి వాసు, సకురు ప్రసాద్, జిగిని రాజుబాబు, వుద్దగిరి సతీష్, కౌన్సిలర్‌ వాసంశెట్టి గంగ, రాజు అ ఉన్నారు. పార్టీలో చేరిన వారిలో కొంతమంది టీడీపీకి చెందిన యువకులు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement