టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిక | tdp activists joined in ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిక

Published Sun, Aug 28 2016 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిక - Sakshi

టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిక

మానేపల్లి (పి.గన్నవరం) :  చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్ధ పాలనతో విసుగుచెందిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్మోçßæనరెడ్డికి మద్దతు పలుకుతున్నారని ఆపార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. మానేపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన 50 మంది  కార్యకర్తలు ఆదివారం ఆపార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో చిట్టబ్బాయి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీలో చేరిన వారిలో అంకాని వెంకట్రావు, గుబ్బల సత్యనారాయణ, కౌరు శ్రీను, మోకా భాస్కరరావు, పుచ్చకాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పెచ్చెటి సురేష్, జిల్లా నాయకులు పితాని నర్శింహారావు, కోళ్ల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement