
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల తాను విశేషంగా ఆకర్షితుడనయ్యానని, ఆయన స్థాయి నేత మరొకరు లేరని అందుకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 1990ల నాటి అటల్ బిహారీ వాజ్‌పేయి తరువాత మోదీ తప్ప అలాంటి నాయకుడిని తాను చూడలేదంటూ ప్రశంసించారు. అంతేకాదు పలువురు నటులు, కళాకారులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాగా పంజాబ్‌లోని లూథియానాలో పుట్జి పెరిగిన అరుణ్ బక్షి 100 కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు కూడా పాడారు. ముఖ్యంగా ‘మహాభారత్' తో సహా పలు టీవీ సీరియల్స్‌లో, అనేక చిత్రాల్లో ఆయన నటించారు.