![TDP Senior Leader Kommareddy Chalama Reddy Join To YSRCP - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/11/28/Chalamareddy%2C%20YSRCP%2C.jpg.webp?itok=q21vGWuT)
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
చలమారెడ్డికి సీఎం వైఎస్ జగన్ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వనించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.షణ్ముక్రెడ్డి, వి.శంకర్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment