దేశం కోటకు బీటలు...
-
వైఎస్సార్‌సీపీలోకి పలువురి చేరిక
-
అమలాపురం దేశంలో కలవరం
-
ప్రజల్లోనే కాదు టీడీపీలోనూ అసంతృప్తే : విశ్వరూప్
అమలాపురం/ ఉప్పలగుప్తం :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండఉ; ఉప్పలగుప్తంలో టీడీపీ కోటకు బీటలు పడుతున్నాయి. నియోజకవర్గ నేత వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, యువకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన సుమారు 150 మంది పార్టీ వీడడంతో టీడీపీ క్యాడర్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలానికి చెందిన టీడీపీ క్రీయాశీలక నాయకులు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువ నాయకుడు నల్లా బాబి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నల్లా విజయ్‌కుమార్, బాబి, క్రాంతి, రాజేష్, రాజు, లక్ష్మణ, తాతాజీ, వెంకటేశ్వరరావు, సూరిబాబు, సాధనాల గణపతి, పూతిక చంటి, చిక్కాల భగవాన్, వల్లభరెడ్డి రాంబాబులతో పాటు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని విశ్వాçÜంతోనే వైఎస్సార్‌సీపీలో చేరామని, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. వీరి రాక వైఎస్సార్‌సీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో కొత్తగా చేరినవారే కాకుండా గ్రామంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున చేరారు.
జీర్ణించుకోలేకపోతున్నారు..
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నా పెద్ద ఎత్తున క్యాడర్ పార్టీని వీడి వెళ్లడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వానపల్లిపాలెంలో జరిగిన సంఘటన ఆరంభం మాత్రమేనని, ముఖ్యనేత వ్యవహార శైలి మారకుంటే మరింతమంది పార్టీని వీడే అవకాశముందని ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.