cader
-
రేపు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: పార్టీ కేడర్‌తో కీలక సమావేశం నిర్వహించేందుకు అధికారపక్షం వైఎస్సార్సీపీ సిద్ధం అయ్యింది. మంగళవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్‌లో మండల, బూత్ లెవల్లో పని చేసే పార్టీ శ్రేణితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు(కొత్త-పాత ఇన్‌ఛార్జిలు) పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది. రేపటి సమావేశానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా హాజరవుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో.. ఎన్నికల్లో ఎలా పని చేయాలో కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం ఇది. క్షేత్రస్థాయి. .మండల కార్యకర్తల సమావేశం. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు. ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు. ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు.. గడపగడపకు కార్యక్రమంతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రజల్లోనే ఉంది. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాల్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని మరీ తీరుస్తున్నాం. అందుకే.. అందరి కంటే ముందుగా ఎన్నికల కోసం గట్టి టీమ్‌ను సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం. బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం. సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది. రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం. .. మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు. మేం ఆరోజే చెప్పాం. మీకే బ్యాడ్ టైం మొదలుకాబోతోందని. అసంతృప్తుల్ని పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు. టీడీపీ-జనసేన అతుకుల బొంతగా ఉంది. పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు. గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం. అవకాశం ఉన్న చోట వాళ్లను చేర్చుకునే అంశం పరిశీలిస్తాం అని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాట్లను సజ్జలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి పార్టీ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి సమీక్షించారు. ‘‘ఎంతమంది కలిసి వచ్చినా మా(వైఎస్సార్సీపీ) విజయాన్ని ఎవరూ ఆపలేరు. 175 కి 175 గెలవబోతున్నాం...ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. మార్చి 3వ తేదీన చివరి సిద్ధం సభ జరగబోతోంది. ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది. కీలకమైన నాయకులు,బూత్ లెవల్లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు. పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2,700 మందికి ఆహ్వానం పంపించాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: అయోమయంలో మావోయిస్ట్ క్యాడర్
-
అధినేత సమక్షంలోనే తమ్ముళ్ల తన్నులాట
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఈ ఏడాది ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పుతో చావు దెబ్బతిన్న జిల్లా టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఎన్నికలనంతరం కూడా అంతర్గత విభేదాలతో పార్టీ మరింత పతనావస్థకు చేరింది. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కూడా కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది. తాజాగా ఏకంగా అధినేత సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. కడప పర్యటనలో రెండవరోజు మంగళవారం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జిరిగిన కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో 15వ డివిజన్ ఇన్చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో గొడవ మొదలైంది. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. చంద్రబాబు సమక్షంలోనే సుబ్బయ్యపై శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సరైన విధంగా స్పందించక పోవడం గమనార్హం. ఈ సంఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్లో సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, 8 మంది అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మీకు అండగా ఉంటాం
పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ధర్మాన, అంబటి శహపురంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి సత్యనారాయణను ఆత్మహత్యకు పురిగొల్పిన ఎమ్మెల్యే, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ నేతల డిమాండ్ శహపురం (బిక్కవోలు) /కాకినాడ : ఇలాంటి వేధింపులు ఇంకెంతో కాలం సాగవు.... ధైర్యంగా ఉండండి.. పార్టీ తరపున మీకు పూర్తిఅండగా ఉంటాం..అంటూ పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శహపురంలో పార్టీ కార్యకర్త రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. పోలీసులు రౌడీషీట్ తెరవడంతో ఆవేదనకు గురైన శహపురానికి చెందిన రాయుడు సత్యనారాయణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని శుక్రవారం మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, తదితరులు శహపురంలో పరామర్శించారు. ముందుగా గ్రామ శివారులో ఉన్న శివాలయం వద్ద నుంచి వారు కార్యకర్తలతో కలసి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు కన్నబాబు ఘటన జరిగిన తీరును, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను, అధికార పార్టీ ఆగడాలను, పోలీసుల దౌర్జన్య కాండను పార్టీ నేతలకు వివరించారు. ఓ పక్క బాధితులు గోడు చెబుతుంటే మరోపక్క జనంతో పాటు కలిసిపోయి ఓ కానిస్టేబుల్ సంఘటనను వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుమారులు రాయుడు మురళి, లోవరాజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్న తీరును వివరించారు. సుమారు 58 ఏళ్ల మృతుని సోదరునిపై 12ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం కేసు పెట్టారని, కుమారులు, సోదరులు, మేనల్లుళ్లపై రౌడీ షీట్లు తెరిచి, కేసులు పెట్టి తీవ్రంగా వే«ధిస్తున్నారంటూ వాపోయారు. క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి ఓ టీడీపీ నేత ఇంటి అద్దం పగిలిందన్న సాకుతో వైఎస్సార్ సీపీ అభిమాని కుమారుడిని 15రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారని అతని తల్లి వాపోయింది. శహపురం, వేండ్ర తదితర గ్రామాలలో పార్టీ అభిమానులు ఎదుర్కొన్న సమస్యలు విని ధర్మాన, అంబటితో పాటు పార్టీ నేతలంతా నివ్వెరపోయారు. మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరీ దేవి, వివిధ నియోజక వర్గాల కోఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి,రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధానకార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు,మిండగుదిటి మోహన్,వట్టికూటి రాజశేఖర్,చెల్లుబోయిన శ్రీను,రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్రప్రచార కమిటి ప్రచారకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అల్లి రాజబాబు,ఎస్సీసెల్ కార్యదర్శిబత్తుల భీమారావు,రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు, మట్టపర్తి మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు,రాజమండ్రి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆరీప్, రాష్ట్రయువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీను, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గాజంగి వెంకటరమణ, వుండ్రు దొరబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రిమ్మలపూడి అబ్బు, జిల్లా కమిటీ సభ్యులు తిబిరిశెట్టి ఆదినారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు చందాల వెంకటరమణ, యువజన అధ్యక్షుడు పేపకాయల వెంకటరమణ, మండల సాంస్కృతికి విభాగం అధ్యక్షుడు బుద్ధాల శ్రీను, వేంద్ర ఎంపీటీసీ సభ్యుడు కూసూరి దత్తుడు, సర్పంచ్ గాజంగి సూర్యకాంతం, ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు కర్రి శ్రీను, రొక్క సత్తిబాబు, తాడాళ మణకంఠ, పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, చీపూరు శ్రీను, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం అందజేత పైన గ్రామానికి చెందిన మండల బీసీ సెల్ కన్వీనర్ గుత్తుల వెంకటరమణ అందచేసిన రూ.10 వేలను రాయుడు సత్యనారాయణ కుటుంబానికి ధర్మాన అందచేశారు. సర్కార్‌పై ధర్మాన మండిపాటు కష్టాల్లో ఉన్న ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఆ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పేయేలా చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. శహపురం లో రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు తెరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాడతామన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తొలుత కేసులు పెట్టడం, తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేను కలవమనడం, అనంతరం పార్టీని ఫిరాయించేలా ఒత్తిడి చేయడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పార్టీ జెండా పట్టుకున్న వారిని స్టేషన్లకు పిలిపించడం గంటల తరబడి వేధించడం, కేసులు పెట్టడం మామూలయిపోయిందన్నారు. అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎక్కడా లేనంత దారుణంగా తమ నియోజకవర్గంలో పోలీసు వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పారు. -
దేశం కోటకు బీటలు...
వైఎస్సార్సీపీలోకి పలువురి చేరిక అమలాపురం దేశంలో కలవరం ప్రజల్లోనే కాదు టీడీపీలోనూ అసంతృప్తే : విశ్వరూప్ అమలాపురం/ ఉప్పలగుప్తం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుల సొంత మండఉ; ఉప్పలగుప్తంలో టీడీపీ కోటకు బీటలు పడుతున్నాయి. నియోజకవర్గ నేత వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, యువకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన సుమారు 150 మంది పార్టీ వీడడంతో టీడీపీ క్యాడర్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలానికి చెందిన టీడీపీ క్రీయాశీలక నాయకులు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువ నాయకుడు నల్లా బాబి ఆధ్వర్యంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నల్లా విజయ్‌కుమార్, బాబి, క్రాంతి, రాజేష్, రాజు, లక్ష్మణ, తాతాజీ, వెంకటేశ్వరరావు, సూరిబాబు, సాధనాల గణపతి, పూతిక చంటి, చిక్కాల భగవాన్, వల్లభరెడ్డి రాంబాబులతో పాటు సుమారు 150 మంది పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని విశ్వాçÜంతోనే వైఎస్సార్సీపీలో చేరామని, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. వీరి రాక వైఎస్సార్సీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో కొత్తగా చేరినవారే కాకుండా గ్రామంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున చేరారు. జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉన్నా పెద్ద ఎత్తున క్యాడర్ పార్టీని వీడి వెళ్లడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వానపల్లిపాలెంలో జరిగిన సంఘటన ఆరంభం మాత్రమేనని, ముఖ్యనేత వ్యవహార శైలి మారకుంటే మరింతమంది పార్టీని వీడే అవకాశముందని ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
తెలంగాణ విమోచనపై ప్రచారభేరి
హన్మకొండ : తెలంగాణ విమోచన దినంపై ప్రజ లకు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) మంత్రి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. శనివారం హన్మకొండ ఎన్జీఓఎస్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా కమిటీ సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. దీనిపై సెప్టెంబర్ 4, 5 తేదీల్లో కలెక్టర్, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించాలన్నారు. 23న షోయబుల్లాఖాన్ వర్ధంతి సభను జరపాలన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్ 10న ఆమె స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొననున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు రాజమౌళి, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, పెదగాని సోమయ్య, బానోత్ దిలీప్‌నాయక్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, రవళి, కొత్త దశరథం, విజయారావు, చందుపట్ల కీర్తి, కుమారస్వామి, కేవీఎల్ఎన్.రెడ్డి, సత్యనారాయణరావు, శ్రీరాముల మురళీమనోహర్‌రావు, త్రిలోకేశ్వర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.