మీకు అండగా ఉంటాం | i suport all cader | Sakshi
Sakshi News home page

మీకు అండగా ఉంటాం

Published Sat, Jul 15 2017 12:10 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

i suport all cader

  • పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన ధర్మాన, అంబటి
  • శహపురంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు పరామర్శ
  • బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • సత్యనారాయణను ఆత్మహత్యకు పురిగొల్పిన ఎమ్మెల్యే, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలి‍
  • వైఎస్సార్ నేతల డిమాండ్
  • శహపురం (బిక్కవోలు) /కాకినాడ  :
     ఇలాంటి వేధింపులు ఇంకెంతో కాలం సాగవు.... ధైర్యంగా ఉండండి.. పార్టీ తరపున మీకు పూర్తిఅండగా ఉంటాం..అంటూ పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శహపురంలో  పార్టీ కార్యకర్త రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. పోలీసులు రౌడీషీట్ తెరవడంతో ఆవేదనకు గురైన శహపురానికి చెందిన రాయుడు సత్యనారాయణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని శుక్రవారం మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణు,  తదితరులు  శహపురంలో పరామర్శించారు. ముందుగా గ్రామ శివారులో ఉన్న శివాలయం వద్ద నుంచి వారు కార్యకర్తలతో కలసి శాంతి ర్యాలీ నిర్వహిస్తూ సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  వైఎస్సార్‌ సీపీ జిల్లా అ«ధ్యక్షుడు కన్నబాబు ఘటన జరిగిన తీరును, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను, అధికార పార్టీ ఆగడాలను, పోలీసుల దౌర్జన్య కాండను పార్టీ నేతలకు వివరించారు. ఓ పక్క బాధితులు గోడు చెబుతుంటే మరోపక్క జనంతో పాటు కలిసిపోయి ఓ కానిస్టేబుల్‌ సంఘటనను వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుమారులు రాయుడు మురళి, లోవరాజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్న తీరును వివరించారు. సుమారు 58 ఏళ్ల మృతుని సోదరునిపై 12ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం కేసు పెట్టారని, కుమారులు, సోదరులు, మేనల్లుళ్లపై రౌడీ షీట్లు తెరిచి, కేసులు పెట్టి తీవ్రంగా వే«ధిస్తున్నారంటూ వాపోయారు.  క్రికెట్‌ ఆడుతుండగా బాల్‌ వెళ్లి ఓ టీడీపీ నేత ఇంటి అద్దం పగిలిందన్న సాకుతో వైఎస్సార్‌ సీపీ అభిమాని కుమారుడిని 15రోజుల పాటు స్టేషన్‌ చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారని అతని తల్లి వాపోయింది. శహపురం, వేండ్ర తదితర గ్రామాలలో పార్టీ అభిమానులు ఎదుర్కొన్న సమస్యలు విని ధర్మాన, అంబటితో పాటు  పార్టీ నేతలంతా  నివ్వెరపోయారు.  మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పాముల రాజేశ్వరీ దేవి, వివిధ నియోజక వర్గాల కోఆర్డినేటర్లు పర్వత పూర్ణచంద్రప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి,రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధానకార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు,మిండగుదిటి మోహన్,వట్టికూటి రాజశేఖర్,చెల్లుబోయిన శ్రీను,రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్రప్రచార కమిటి ప్రచారకార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి అల్లి రాజబాబు,ఎస్సీసెల్‌ కార్యదర్శిబత్తుల భీమారావు,రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు  సిరిపురపు శ్రీనివాసరావు, మట్టపర్తి మురళీకృష్ణ, జున్నూరి వెంకటేశ్వరరావు,రాజమండ్రి మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఆరీప్, రాష్ట్రయువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీను,  జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల కన్వీనర్‌ గాజంగి వెంకటరమణ, వుండ్రు దొరబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రిమ్మలపూడి అబ్బు, జిల్లా కమిటీ సభ్యులు తిబిరిశెట్టి ఆదినారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు చందాల వెంకటరమణ, యువజన అధ్యక్షుడు పేపకాయల వెంకటరమణ, మండల సాంస్కృతికి విభాగం అధ్యక్షుడు బుద్ధాల శ్రీను, వేంద్ర ఎంపీటీసీ సభ్యుడు కూసూరి దత్తుడు, సర్పంచ్‌ గాజంగి సూర్యకాంతం, ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు కర్రి శ్రీను, రొక్క సత్తిబాబు, తాడాళ మణకంఠ, పిల్లి భాస్కరరావు, పెంకే ఏకాశి, చీపూరు శ్రీను, అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
     ఆర్థిక సాయం అందజేత
    పైన గ్రామానికి చెందిన మండల బీసీ సెల్‌ కన్వీనర్‌  గుత్తుల వెంకటరమణ అందచేసిన రూ.10 వేలను రాయుడు సత్యనారాయణ కుటుంబానికి ధర్మాన అందచేశారు.
     సర్కార్‌పై ధర్మాన మండిపాటు
    కష్టాల్లో ఉన్న ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఆ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పేయేలా చేస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. శహపురం లో  రాయుడు సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు తెరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాడతామన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తొలుత కేసులు పెట్టడం, తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేను కలవమనడం, అనంతరం పార్టీని ఫిరాయించేలా ఒత్తిడి చేయడం అధికార పార్టీకి పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ  పార్టీ జెండా పట్టుకున్న వారిని స్టేషన్లకు పిలిపించడం గంటల తరబడి వేధించడం, కేసులు పెట్టడం మామూలయిపోయిందన్నారు. అనపర్తి కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎక్కడా లేనంత దారుణంగా తమ నియోజకవర్గంలో పోలీసు వేధింపులు పెరిగిపోతున్నాయని చెప్పారు.  
     
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement