వైఎస్సార్ సీపీకి యువత ఆకర్షితులవుతున్నారు
Published Tue, May 2 2017 12:16 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
రాజమహేంద్రవరం సిటీ :
జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో యువత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని ఆ పార్టీ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. సోమవారం సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 46వ డివిజ¯ŒSకు చెందిన మేడబోయిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువత రౌతు సూర్యప్రకాశరావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ , రౌతు సూర్యప్రకాశరావులు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో మెలుగుతూ పేదప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీకి మంచిరోజులు రానున్నాయన్నారు. మేడే ను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన జెండాను రౌతు ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, భీమవరపు వెంకటేశ్వర్రావు, వాకచర్ల కృష్ణ, నగర అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, పెంకే సురేష్, ఎం.విజయకుమార్, కంది రాఘవ, ఉపద్రష్ట శ్రీనివాస్. ఎం.ధనరాజు, మానుకొండ విజయకుమార్, ఆకాశపు శ్రీను.గుత్తుల శివశంకర్, కాటం రజనీకాంత్, పెదిరెడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement