అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు: ఎమ్మెల్యే | joined trs saw development only | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు: ఎమ్మెల్యే

Published Mon, Aug 15 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు: ఎమ్మెల్యే

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు: ఎమ్మెల్యే

కేతేపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి  వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన  పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హమీలను 90 శాతం అమలు చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించి గ్రామస్థాయి నుంచి పార్టీకి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బచ్చలకూరి విక్రమ్, డి.శంకర్, బి.సైదులు, డి.సతీష్, నక్కల జాన్, బి.నాగయ్య, సీహెచ్‌.సైదులు, అనిల్, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.   కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కె.వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు   పూజర్ల శంభయ్య, నాయకులు   బి.సుందర్, కె.ఎల్లయ్య,   కె.ఎల్లయ్య, దుర్గం శ్రవణ్, డి.నాగబాబు   పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement