‘చెయ్యి’కి జై కొట్టిన సోనూ సూద్‌.. కాంగ్రెస్‌లోకి మాళవిక | Sonu Sood Sister Malvika Sood Joines Congress In Punjab Elections | Sakshi
Sakshi News home page

Malvika Sood: ‘చెయ్యి’కి జై కొట్టిన సోనూ సూద్‌.. కాంగ్రెస్‌లోకి మాళవిక

Published Mon, Jan 10 2022 9:17 PM | Last Updated on Mon, Jan 10 2022 9:33 PM

Sonu Sood Sister Malvika Sood Joines Congress In Punjab Elections - Sakshi

Sonu Sood Sister Malvika Sood Joines Congress In Punjab Elections: సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుని నిజ జీవితంలో మాత్రం అందరిచేత హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది అన్నార్థులకు సాయం అందించిన సోనూ సీరియస్‌ పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి ప్రాణాలు కాపాడాడు. ఇదిలా ఉంటే సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే మోగాలోని సోనూసూద్‌ నివాసానికి వెళ్లిన పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వారితో చర్చించారు. అనంతరం ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 

గతేడాది నవంబర్‌లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టత  ఇవ్వలేదు. అలాగే ఇటీవల పంజాబ్ ఐకాన్‌ పదవి నుంచి సోనూసూద్ తప్పుకున్నారు. ఇదిలా ఉంటే పంజాబ్‌లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెలబ్రిటీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ కూడా త్వరలోనే హస్తం గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 

ఇదీ చదవండి: సోనూసూద్‌ కీలక నిర్ణయం.. పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌కి గుడ్‌బై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement