Sampath Raj
-
150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో వ్యవస్థ రికార్డు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్ ‘వ్యవస్థ’. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఈ సిరీస్ 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ సందర్బంగా వ్యవస్థ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వ్యవస్థలో వర్క్ చేసిన వారందరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌గారితో కలిసి సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అలాగే కామ్నా జెఠ్మలానీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. హెబ్బా పటేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ రత్నం అంటే చాలా ఇష్టం. తను వ్యవస్థలో పోషించిన తీరు అద్భుతం. దర్శకుడు ఆనంద్ రంగగారితో డీకే బోస్ చిత్రం నుంచి పరిచయం ఉంది. వ్యవస్థ సినిమాను ఎలా తెరకెక్కించారా? అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్’’ అన్నారు సందీప్ కిషన్. కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘సందీప్ కిషనన్నను కలిసిన తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంపత్ రాజ్, అనిల్ సార్ అందరికీ థాంక్స్. హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జీ 5వారు చేస్తోన్న సపోర్ట్ మరచిపోలేం’’ అన్నారు. కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ ‘‘ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు. సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో నాకీ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాగారికి థాంక్స్. వ్యవస్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావని అడిగారు. అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మకం ఉందని చెప్పాను. ఇదొక స్లో బర్నర్‌లా ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బావుంటే ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి వ్యవస్థ ప్రూవ్ చేసింది’’ అన్నారు. -
ప్రమాణం చేసి మరీ నిజాలు చెప్పిన ప్రియమణి
-
నా బిడ్డకు నాలుగేళ్ల వయసున్నప్పుడు విడాకులిచ్చా: మిర్చి విలన్
సంపత్ రాజ్.. ఎన్నో సినిమాలు చేసినా ఇప్పటికీ మిర్చి విలన్‌గానే ఆయన ఎక్కువ ఫేమస్. ఈ సినిమాకుగానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు సైతం అందుకున్నాడు. టాలీవుడ్లో టాప్ విలన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు. తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో తండ్రి ప్రోత్సాహంతో ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో అవకాశాల కోసం వేట ప్రారంభించాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గొప్ప నటుడిగా కీర్తి సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే ఇష్టం. కానీ అమ్మకు నేను సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను సక్సెస్ అయిన తర్వాత మాత్రం ఆమె ఎంతో సంతోషించింది. కానీ నా విజయాన్ని నాన్న చూడలేకపోయారన్న బాధ మాత్రం ఎప్పటికీ వెంటాడుతుంది. మా అమ్మాయికి నాలుగైదేళ్ల వయసున్నప్పుడు నా భార్యకు విడాకులిచ్చాను. మేమిద్దరం పెద్ద గొడవ చేసి విడాకులు తీసుకోలేదు. కూర్చుని మాట్లాడుకున్నాకే సామరస్య వాతావరణంలో విడిపోయాం. నా కూతురు కూడా తరచూ తనను కలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. 23 ఏళ్లకే నేను పెళ్లి చేసుకున్నాను. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవడమే బహుశా విడాకులకు కారణమై ఉండొచ్చు. పాప బాధ్యత నేనే తీసుకున్నాను. తనిప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంది. తనకు సినీ ఇండస్ట్రీకి రావాలన్న ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చాడు సంపత్ రాజ్. చదవండి: కడుపు మాడ్చుకుని, నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్: అభి -
నా క్యారెక్టర్ ఇలా ఉంటేనే సినిమాలు చేస్తాను
-
ఒక ఎపిసోడేని మాత్రమే ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాం అంటే..
-
Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ
టైటిల్: యశోద నటీనటులు: సమంత,వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీదేవి మూవీస్ నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం: హరి-హరీష్ సంగీతం:మణిశర్మ సినిమాటోగ్రఫర్:ఎం. సుకుమార్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది: నవంబర్ 11, 2022 ‘యశోద’ కథేంటంటే.. ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకవైపు ఇండియాకు వచ్చిన హాలీవుడ్ నటి ఒలివియా అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే టాప్ మోడల్ ఆరూషి, ప్రముఖ వ్యాపారవేత్త శివరెడ్డి కారుప్రమాదంలో మరణిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్(సంపత్) టీమ్ రంగంలోకి దిగుతుంది. మరోవైపు పేదింటికి చెందిన యశోద(సమంత) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసీ(అద్దెగర్భం)ని ఎంచుకుంటుంది. ఆమె కడుపున పుట్టబోయే బిడ్డ కోటీశ్వరుల ఇంటికి వెళ్తుందని..ఆమెను ఆరోగ్యంగా ఉంచేందుకు సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ ‘ఈవా’కి తరలిస్తారు. అక్కడ అందరూ అద్దెగర్భం దాల్చిన వాళ్లే ఉంటారు. వీరి బాగోగులను చూసుకునేందుకు మధు(వరలక్ష్మీ శరత్‌కుమార్), డాక్టర్ గౌతమ్(ఉన్ని ముకుందన్) ఉంటారు. యశోద ‘ఈవా’కి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అనుమానస్పదంగా మరణించిన హాలీవుడ్ నటి ఓలివియాకి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏదైన సంబంధం ఉందా? మోడల్ ఆరూషి నిజంగానే కారుప్రమాదంలో మరణించిందా?లేదా ఎవరైనా హత్య చేశారా? ప్రపంచంలో ధనవంతులైన మహిళలు రహస్యంగా ఇండియా ఎందుకు వస్తున్నారు? ఈ కథలో కేంద్రమంత్రి గిరిధర్ పాత్ర ఏంటి? అసలు యశోద నేపథ్యం ఏంటి అనేది థియేటర్స్‌లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. 'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకద్వయం హరి, హరీష్ ఈ కథను రాసుకున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ట్విస్టులు ఉంటాయి. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, యాక్షన్..అన్ని ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. థ్రిల్లింగ్ సీన్స్‌ని ప్రేక్షకుడు ఆస్వాదించలోపే.. లాజిక్ లేని సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి. ఈవాలో యశోద చేసే పనులు విలన్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు వదిలేయడం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆమె ఈజీగా బయటకు వెళ్లడం.. ఇలా చాలా సీన్లలో లాజిక్ ఉండదు. ఒక థ్రిల్లింగ్ సీన్ తర్వాత మరో ఎమోషనల్ సీన్ అన్నట్లుగా ఫస్టాఫ్ సాగదీతగా సాగుతుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక సెకండాఫ్ నుంచి వచ్చే ప్రతి సీన్ కొత్తగా ఉంటూ ఉత్కంఠ కలిగిస్తాయి. యశోద నేపథ్యం గురించి చెప్పే సీన్స్ ‘పోకిరి’తరహాలో ఉంటాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ బ్యాక్‌స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. దానిని మరింత డెప్త్‌గా డిజైన్ చేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. సమంత ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే. యశోద పాత్రలో నటించడం కంటే జీవించేసిందని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమా కోసం సమంత పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక సమంత తర్వాత బాగా పండిన పాత్రలు వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నికృష్ణలది. నెగెటివ్ షేడ్స్ ఉన్న మధు, డాక్టర్ గౌతమ్ పాత్రల్లో ఇద్దరూ పరకాయ ప్రవేశం చేశారు. పోలీసు అధికారిగా శత్రు, మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్‌గా సంపత్ చక్కటి నటనను కనబరిచారు. కేంద్రమంత్రి గిరిధర్ పాత్రకి రావురమేశ న్యాయం చేశాడు. కలికా గణేశ్, దివ్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ బాగుంది. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ కోసం కాకుండా కథలో భావాన్ని తెలియజేసేలా డైలాగ్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ నటి నా మాజీ భార్య కాదు: క్లారిటీ ఇచ్చిన 'మిర్చి' విలన్
సంపత్ రాజ్.. 'మిర్చి' సినిమాతో విలన్‌గా పాపులర్ అయ్యాడీ నటుడు. 'మిర్చి' తర్వాత ఎన్నో విభిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్లో టాప్ విలన్‌గా పేరు గడించిన సంపత్ తాజాగా ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముందుగా తన కుటుంబం గురించి చెప్తూ.. 'మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లినప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోందట. ఆమెను చూసి ఎవరో పనిమనిషి అనుకున్నాడట. ఆయన్ను చూడగానే అమ్మ పరుగెత్తుకుంటూ లోపలకు వెళ్లి పోలీసులొచ్చారని చెప్పింది. అలా వాళ్ల మొదటి పరిచయం జరిగింది. మా పేరెంట్స్‌కు మేము ఏడుగురం సంతానం. అందులో నేను ఆఖరివాడిని' అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతానని ఓ డైరెక్టర్‌ను సరదాగా బెదిరించానని చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి చూస్తే ఆ డైరెక్టర్ మరెవరో కాదు త్రివిక్రమ్ అని అర్థమవుతోంది. ఆ దర్శకుడు ఎక్కడుంటాడని సునీల్‌ను ఆరా తీయగా ఆయనకో ఆఫీసు ఉందని, అక్కడికి వెళ్లమని సూచించాడని పేర్కొన్నాడు. 100% ఆయనను అటాక్ చేస్తానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఆర్టిస్టు శరణ్య, ఆమె ఫ్యామిలీ.. తనకు, తన కుటుంబానికి చాలా క్లోజ్ అన్న సంపత్ ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించానని తెలిపాడు. అయితే ఆ మాత్రం దానికే ఆమెను తన మాజీ భార్యగా పేర్కొంటూ అసత్యపు వార్తలు రాశారని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో తండ్రే ఇంటి నుంచి పారిపోమని సలహా ఇచ్చారని తెలిపాడు. -
సినీనటుడు సంపత్‌కు బాహుబలి కాజాతో సత్కారం
సాక్షి, మండపేట: ప్రముఖ సినీ విలన్ సంపత్‌ను శుక్రవారం తాపేశ్వరంలోని మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కురసాల కల్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ సీతానగరం మండలం వంగలపూడిలో జరుగుతోంది. షూటింగ్లో పాల్గొన్న సంపత్‌ను సురుచి పీఆర్ఓ వర్మ కలిసి బాహుబలి కాజాతో సత్కరించారు. -
యాక్షన్ థ్రిల్లర్
కార్తీక్ రాజు, వర్ష బొల్లమ్మ జంటగా సంపత్ రాజ్ కీలక పాత్రలో నటించనున్న సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన స్వరాజ్ నూనె ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మూవీ మేకర్స్ నిర్మాణంలో గురవయ్య యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. శ్రీచరణ్ పాకాల మంచి బాణీలు సమకూర్చారు. జయపాల్ రెడ్డి కెమెరామేన్‌గా చేస్తారు’’ అన్నారు గురవయ్య యాదవ్. ఈ చిత్రానికి ఆర్వీ రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు
రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లుగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారితెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. మంచు విష్ణు, సురభిలపై భారీ సెట్ లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ సందర్భంగా వచ్చే లవ్ సీన్స్ కావటంతో ఈ సీన్ కోసం భారీ సంఖ్యలో వెహికల్స్ ను ఉపయోగించి షూటింగ్ చేస్తున్నారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తికానుంది. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇనీ అవనేతో దర్శకుడిగా...
నృత్యదర్శకుడు మెగా ఫోన్ పట్టడం అనేది సాధారణ విషయం. ఇంతకు ముందు ప్రభు దేవా, లారెన్స్, హరికుమార్, రాజు సుందరం లాంటి వాళ్లు దర్శకులుగా అవతారం ఎత్తి విజయం సాధించారు. తాజాగా, వారి బాటలో నృత్య దర్శకుడు సంపత్ రాజ్ పయనించేం దుకు సిద్ధం అయ్యారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇనీ అవనే. తమిళ్ తాయ్ క్రియేషన్స్ , ఏఎన్ఏ మూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ హీరోగా నటిస్తున్నారు. ఈయన ఇం తకు ముందు ఒరు కాదల్ సెయివీర్, కాదల్ సెయ్య వీరుంబు మిఠాయి, తదితర చిత్రాల్లో నటించడం గమనార్హం. హీరోయిన్గా ఆష్లీలా, శశి, రూపి నటిస్తున్నా రు. నటి భావానీ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పేర్కొంటూ, హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లి చేసునే యత్నంలో ఓ మంత్రి చెల్లెలు పరిచయం అవుతుందన్నారు. ఆమెను తమ పెళ్లికి సాయం చేయమని కోరగా, సరేనని అంగీకరించి, చివరకు అడ్డుకుంటుదన్నారు. అందుకు గల కారణాలు ఏమిటి, ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ చిత్రంగా పేర్కొన్నారు. జాతీయ అవార్డు పొందిన కాదల్ కోట్టై, రజనీ కాంత్ నటించిన వీర, తదితర 480 చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు సంపత్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఆర్ మణికంఠన్, ఏ నజీర్ అహ్మద్ నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. -
రాముడిలా మారే కృష్ణుడు
కృష్ణుడిలాంటి కుర్రాడు రాముడిలా మారడానికి కారణం ఏంటి? మారిన తర్వాత అతను రాముడిలానే ఉన్నాడా? మళ్లీ మారాడా? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. ‘హ్యపీడేస్’ ఫేం రణధీర్, గౌతమి చౌదరి జంటగా టి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్ రాజ్ దర్శకుడు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఆశయంతో ఈ సినిమా చేస్తున్నాం. ఇందులో షకీలా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. కథాబలం ఉన్న చిత్రం ఇదని, అన్ని వర్గాలవారూ చూసే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. టైటిల్ రోల్‌ను రణధీర్ అద్భుతంగా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇందులో తనది రెండు కోణాలున్న పాత్ర అని, ‘హ్యాపీడేస్’, ‘బ్రేకప్’ తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇదని రణధీర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరా: సంతోష్ శానినేని, సంగీతం: నవనీత్ చారి.