Actor Sampath Raj Talk About His Divorce - Sakshi
Sakshi News home page

Sampath Raj: చిన్నవయసులోనే పెళ్లి, కొంతకాలానికే విడాకులు తీసుకున్నాం.. మిర్చి విలన్‌

Published Thu, May 4 2023 7:33 PM | Last Updated on Fri, May 5 2023 12:20 PM

Actor Sampath Raj About His Divorce - Sakshi

సంపత్‌ రాజ్‌.. ఎన్నో సినిమాలు చేసినా ఇప్పటికీ మిర్చి విలన్‌గానే ఆయన ఎక్కువ ఫేమస్‌. ఈ సినిమాకుగానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు సైతం అందుకున్నాడు. టాలీవుడ్‌లో టాప్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు. తన తల్లికి సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో తండ్రి ప్రోత్సాహంతో ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలో అవకాశాల కోసం వేట ప్రారంభించాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గొప్ప నటుడిగా కీర్తి సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

'చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే ఇష్టం. కానీ అమ్మకు నేను సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేను సక్సెస్‌ అయిన తర్వాత మాత్రం ఆమె ఎంతో సంతోషించింది. కానీ నా విజయాన్ని నాన్న చూడలేకపోయారన్న బాధ మాత్రం ఎప్పటికీ వెంటాడుతుంది. మా అమ్మాయికి నాలుగైదేళ్ల వయసున్నప్పుడు నా భార్యకు విడాకులిచ్చాను. మేమిద్దరం పెద్ద గొడవ చేసి విడాకులు తీసుకోలేదు. కూర్చుని మాట్లాడుకున్నాకే సామరస్య వాతావరణంలో విడిపోయాం.

నా కూతురు కూడా తరచూ తనను కలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. 23 ఏళ్లకే నేను పెళ్లి చేసుకున్నాను. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవడమే బహుశా విడాకులకు కారణమై ఉండొచ్చు. పాప బాధ్యత నేనే తీసుకున్నాను. తనిప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుంది. తనకు సినీ ఇండస్ట్రీకి రావాలన్న ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చాడు సంపత్‌ రాజ్‌.

చదవండి: కడుపు మాడ్చుకుని, నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్‌: అభి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement